రెండు సినిమాలతో సుకుమార్...

Tuesday,December 20,2016 - 12:04 by Z_CLU

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఒకేసారి రెండు సినిమాలతో రెడీ అవుతున్నాడు. ప్రెజెంట్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్న సుక్కు… ఆ సినిమాతో పాటు మరో సినిమా పనిలోనూ బిజీగా ఉన్నాడు. కుదిరితే సైమల్టేనియస్ గా రెండూ పూర్తిచేయాలనేది సుకుమార్ ప్లాన్.

సుకుమార్ చేయబోయే ఈ రెండు సినిమాల్లో ఒకటి తను డైరెక్ట్ చేయబోయే సినిమా కాగా… మరొకటి ఆయన నిర్మించే సినిమా అట. లేటెస్ట్ గా ‘కుమారి 21 ఎఫ్’ తో నిర్మాతగా గ్రాండ్ హిట్ అందుకున్న సుకుమార్ ఆ సినిమా డైరెక్టర్ సూర్యప్రతాప్ తో మరో సినిమా నిర్మించబోతున్నాడని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ -ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేసిన సుకుమార్… రామ్ చరణ్ తో తను డైరెక్ట్ చేసే సినిమాతో పాటు ఈ మూవీని కూడా జనవరిలో స్టార్ట్ చేసి సెట్స్ పైకి తీసుకురావడానికి రెడీ అవుతున్నాడట. సో.. నెక్ట్స్ ఇయర్ డైరెక్షన్ తో పాటు.. అటు ప్రొడ్యూసర్ గా కూడా బిజీగా ఉండబోతున్నాడు సుకుమార్.