హాట్ టాపిక్: సుక్కూ తెలంగాణ సాయుధపోరాటం

Thursday,April 30,2020 - 12:59 by Z_CLU

 

ప్రస్తుతం అల్లు అర్జున్ తో ‘పుష్ప’ సినిమా చేస్తున్నాడు సుకుమార్. రంగస్థలం తర్వాత ఎప్పటిలాగే గ్యాప్ తీసుకొని ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు. లాక్ డౌన్ నేపథ్యంలో సినిమా షూటింగ్ వాయిదా పడింది. త్వరలోనే ఓ భారీ షెడ్యుల్ ప్లాన్ చేస్తున్నారు.

అయితే బన్నీ సినిమా తర్వాత సుకుమార్ మరో భారీ ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టనున్నారని తెలుస్తుంది. అవును తెలంగాణా సాయుధ పోరాటం నేపథ్యంలో ఓ కథను సిద్దం చేసుకున్నాడట సుక్కు. ‘రంగస్థలం’ తర్వాత ఆ సినిమానే చేయలనుకున్నాడట. కానీ బన్నీ తో ‘పుష్ప’ చేయాల్సి వచ్చిందని తెలిపాడు.

త్వరలోనే ఆ సినిమా చేస్తానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. దీని కోసం తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించి పుస్తకాలన్నీ చదివేశాడట సుక్కూ. మరి ‘పుష్ప’ సినిమా తర్వాత సుకుమార్ నుండి వచ్చే సినిమా అదేనా అనేది హాట్ టాపిక్ గా మారింది.