నాగశౌర్యపై సుకుమార్ ఇంపాక్ట్

Thursday,February 07,2019 - 10:03 by Z_CLU

సుకుమార్ సినిమా సెట్స్ పైకి వస్తుందనగానే ఫస్ట్ ఫోకస్ హీరో లుక్స్ పై మళ్ళుతుంది. హీరోని వీలైనంత స్టైలిష్ గా, డిఫెరెంట్ గా ప్రెజెంట్ చేయడానికే ప్రయత్నిస్తాడు సుక్కు. అయితే ఇప్పుడా ఇంపాక్ట్ నాగశౌర్య పై కూడా పడినట్టుంది. రీసెంట్ గా సరికొత్త లుక్ లో సోషల్ మీడియాలో రిలీజైన నాగశౌర్య ఫోటోని బట్టి, సుకుమార్ నాగశౌర్య లుక్స్ విషయంలో ఇన్వాల్వ్ అయినట్టే అనిపిస్తుంది.

రీసెంట్ గా నాగశౌర్య తో సినిమాని అనౌన్స్ చేశాడు సుకుమార్. శరత్ మరార్ తో కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. అయితే  సాధారణంగా తన బ్యానర్ లో తెరకెక్కే సినిమాల మేకింగ్ ప్రాసెస్ లో పెద్దగా ఇన్వాల్వ్ కాని సుకుమార్, నాగశౌర్య లుక్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. గెడ్డంతో స్టైలిష్ గా కనిపిస్తున్న నాగశౌర్య లుక్స్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేస్తుంది.

యూత్ ఫుల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకి హీరోయిన్ ని ఫిక్స్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్నారు మేకర్స్. కాశి విశాల్ ఈ సినిమాకి డైరెక్టర్. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ గా లాంచ్ కానుంది.