సుకుమార్ హీరోలు

Tuesday,January 31,2017 - 02:20 by Z_CLU

టాలీవుడ్ లో ప్రతీ దర్శకుడికి ఒక్కో మార్క్ ఉంది. ఆ మార్క్ తో సినిమాలను తెరకెక్కిస్తూ ఆడియన్స్ ఎంటర్టైన్ చేస్తూ ముందుకెళ్తుంటారు దర్శకులు. అలా టాలీవుడ్ దర్శకుల్లో సుకుమార్ కి ఓ స్పెషల్ ఇమేజ్ ఉంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి తనదైన మార్క్ హీరోయిజంతో స్టార్ హీరోలను డిఫరెంట్ గా చూపిస్తూ అటు ఫాన్స్ ను ఇటు ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తూ క్రియేటివ్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సుకుమార్క్ పై ఓ లుక్కేద్దాం.

sukumar-_-1
‘గంగోత్రి’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ని తన మొదటి సినిమాలో ‘ఆర్య’ ఆనే ఓ ఎనర్జిటిక్ కుర్రాడిగా చూపించి అదుర్స్ అనిపించాడు సుకుమార్. ఇప్పటికీ ఆర్య అనగానే బన్నీ క్యారెక్టర్ తెలుగు ఆడియన్స్ కళ్ళముందు కనిపిస్తుందంటే అది సుక్కూ క్రెడిట్టే..

sukumar-_-2
‘దేవదాసు’తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎనర్జిటిక్ స్టార్ రామ్ ను యువతరం భావోద్వేగాలతో కూడిన శీను అనే ఓ సరికొత్త క్యారెక్టర్ లో చూపించి హీరోయిజంకి అసలైన నిర్వచనం ఇచ్చాడు సుకుమార్.

sukumar-_-3
‘ఆర్య’ తో అల్లు అర్జున్ ని హీరోగా ప్రెజెంట్ చేసిన సుకుమార్.. మరోసారి ‘ఆర్య 2’ లో స్టైలిష్ లుక్ లో ఓ డిఫరెంట్ క్యారెక్టర్ లో చూపించి అందరినీ మెస్మరైజ్ చేసాడు. బన్నీ కెరీర్ లో గొప్పగా చెప్పుకొనే క్యారెక్టర్ లో ‘ఆర్య 2’ కి మొదటి స్థానం ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు.

sukumar-_-4
అక్కినేని నాగ చైతన్య ను ‘100 % లవ్’ సినిమాలో సరికొత్తగా చూపించి ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసి సూపర్ హిట్ అందుకున్నాడు సుకుమార్. ఈ సినిమాలో కేవలం చదువు గురించి మాత్రమే ఆలోచించే బాలు క్యారెక్టర్ లో నాగ చైతన్య ని సంథింగ్ స్పెషల్ గా చూపించి… హీరో అంటే ఇలా కూడా ఉండొచ్చని ఆడియన్స్ కు చెప్పాడు సుక్కు.

sukumar-_-5
అప్పటి వరకూ కమర్షియల్, ఫామిలీ ఎంటర్టైనర్ సినిమాలతో ఎంటర్టైన్ చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ లో ఓ సరికొత్త కోణాన్ని ఆవిష్కరించిన క్రెడిట్ సుకుమార్ దే. మహేష్ కెరీర్ లో గర్వంగా చెప్పుకొనే క్యారెక్టర్లలో ‘1 నేనొక్కడినే’ సినిమా మొదటి స్థానం లో ఉంటుందనడం లో ఎటువంటి డౌట్ అక్కర్లేదు.

sukumar-_-6
‘నాన్నకు ప్రేమతో’ అనే క్లాసీ టైటిల్ తో ఎన్.టి.ఆర్ ను అల్ట్రా స్టైలిష్ గా చూపించి కేవలం లుక్ తోనే కాకుండా డిఫరెంట్ క్యారెక్టర్ లో కూడా ప్రెజెంట్ చేసి ఫాన్స్ తో పాటు టాలీవుడ్ కి కూడా షాక్ ఇచ్చాడు కుమార్. ఇప్పటి వరకూ ఎన్నడూ కనిపించని ఓ డిఫరెంట్ లుక్, డిఫరెంట్ క్యారెక్టర్ లో తారక్ ను చూపించి అటు ఫాన్స్, ఇటు ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసి ఎన్టీఆర్ కెరీర్ కు ఓ కొత్త దారి చూపించాడు.

sukumar-_-7
ఇప్పటి వరకూ స్టార్ హీరోలను కేవలం ఓ డిఫరెంట్ లుక్ లో మాత్రమే కాకుండా ఓ డిఫరెంట్ క్యారెక్టర్ లో ప్రెజెంట్ చేసి ఔరా అనిపించిన సుకుమార్… ఇప్పుడు రామ్ చరణ్ పై ఫోకస్ పెట్టాడు. రీసెంట్ గా సుక్కూ-చెర్రీ కాంబోలో సినిమా లాంఛ్ అయింది. లాంఛింగ్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ చూసి.. ఇది కదా సుకుమార్ స్టయిల్ అనుకున్నరంతా. ఇప్పటివరకు ఎవరూ చూడని, కలలో కూడా ఊహించని సరికొత్త లుక్, క్యారెక్టరైజేషన్ లో రామ్ చరణ్ ను చూపించబోతున్నట్టు.. ఈ ఒకేేఒక్క పోస్టర్ తో చెప్పకనే చెప్పాడు సుకుమార్. పోస్టర్ లో లుంగీ పైకి కట్టి, కావిడ చేత్తో పట్టుకొని పల్లెటూరి కుర్రాడిగా చరణ్ లుక్ చూస్తుంటే సుకుమార్ మరోసారి ఓ డిఫరెంట్ క్యారెక్టర్ తో.. ఓ డిఫరెంట్ సినిమాతో ఎంటర్టైన్ చేయబోతున్నాడని అర్ధం అవుతుంది.