దేవిశ్రీతో సినిమాపై సుకుమార్ క్లారిటీ

Monday,August 07,2017 - 02:06 by Z_CLU

మ్యూజిక్ సెన్సేషన్ దేవి శ్రీ ప్రసాద్ ను హీరోగా పరిచయం చేస్తూ సుకుమార్ డైరెక్షన్ లో ఓ సినిమా రావాలి. ఈ ప్రాజెక్టును చాన్నాళ్ల కిందటే ఎనౌన్స్ చేశారు. ప్రకటించి కూడా దాదాపు రెండేళ్లు దాటింది. వీరి కాంబినేషన్ లో సినిమాను తమ బ్యానర్ పై నిర్మిస్తానని దిల్ రాజు కూడా ఆ మధ్య అనౌన్స్ చేసిన సంగతి కూడా తెలిసిందే.. అయితే ఆ తర్వాత మళ్ళీ సుకుమార్ ఈ సినిమా గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. ఇక దేవి కూడా తను హీరోగా చేయబోయే సినిమా గురించి ఎక్కడ మాట్లాడలేదు. ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా మరోసారి ఆ ప్రాజెక్టు చర్చకొచ్చింది.

ఫ్రెండ్షిప్ డే సందర్భంగా దేవితో తనకున్న ఫ్రెండ్షిప్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సుకుమార్ దేవి హీరోగా అరంగేట్రం చేయనున్న సినిమా పై స్పందించాడు.. నా బెస్ట్ ఫ్రెండ్ ప్లేస్ లో మొదటి స్థానం దేవికే దక్కుతుందని చెప్పిన సుక్కు… దేవితో చేసే సినిమా కొన్ని అనివార్య కారణాల వాళ్ళ ఆలస్యం అయిందని , త్వరలోనే దేవితో కచ్చితంగా ఓ సినిమా చేస్తానని తెలిపాడు. అంతే కాదు దేవిని హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలనీ ఎప్పుడో నిర్ణయించుకున్నానని, త్వరలోనే దేవితో నా డైరెక్షన్ లో సినిమా ఉంటుందని అంటున్నాడు.