సుకుమార్ ‘దర్శకుడు’ లైన్ క్లియరయింది

Wednesday,July 26,2017 - 04:14 by Z_CLU

సుకుమార్ దర్శకుడు ఆగష్టు 4 న రిలీజ్ అవుతుంది. ఇప్పటికే అటు సోషల్ మీడియాతో పాటు ఫిలిమ్ సర్కిల్స్ లోను ఇంటరెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేస్తున్న ‘దర్శకుడు’ సెన్సార్ క్లియరెన్స్ కూడా పొందింది. క్లీన్ ‘U’ సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా, ఇక ప్రీ రిలీజ్ ఫంక్షన్ ప్రిపరేషన్స్ లో బిజీగా ఉంది.

జూలై 28 న ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని గ్రాండ్ గా ప్లాన్ చేసుకుంది సుక్కు టీమ్. ఈ ఈవెంట్ కి అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడు. ఇప్పటికే తన హీరోలతో ఇంటరెస్టింగ్ గా సినిమాని ప్రమోట్ చేస్తున్న సుకుమార్ సినిమా సూపర్ హిట్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అశోక్, ఈషా రెబ్బ జంటగా నటించిన ఈ సినిమాకి హరి ప్రసాద్ దర్శకుడు.