సుకుమార్ బర్త్ డే స్పెషల్

Wednesday,January 11,2017 - 11:44 by Z_CLU

ఆయన సినిమాలు అర్థం కావాలంటే మినిమం ఇంటెలిజెన్సీ ఉండాలి… ఎంటర్ టైన్ మెంట్ కి ఎగ్జైట్ మెంట్ యాడ్ చేసి పజిల్ లాంటి స్క్రీన్ ప్లే తో లాజికల్ గా సినిమాలు తీసే సుకుమార్ బర్త్ డే ఈ రోజు.

sukumar-1

11 జనవరి 1970 లో తూర్పు గోదావరి జిల్లాలో పుట్టిన సుకుమార్ కాకినాడ లో కొన్ని రోజులు మాథ్స్, ఫిజిక్స్ లెక్చరర్ గా చేశారు. ఆ తరవాత డైరెక్టర్స్ మోహన్, వివి.వినాయక్ సినిమాలకు కథల్ని అందించిన సుకుమార్ ‘ఆర్య’ సినిమాతో దర్శకుడిగా మారాడు. ఫస్ట్ సినిమాకే బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా నంది అవార్డు గెలుచుకున్నాడు. బన్నీతో ఆర్య, ఆర్య-2, నాగచైతన్యతో హండ్రెడ్ పర్సెంట్ లవ్, ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో సినిమాలు తీశాడు సుకుమార్.

sukumar-2

ఇప్పటివరకు 6 సినిమాలకు డైరెక్షన్ చేసిన సుకుమార్, ప్రస్తుతం రామ్ చరణ్ తో సినిమాను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. ఇంకా టైటిల్ డిసైడ్ కాని ఈ సినిమాలో రామ్ చరణ్ ని సరికొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నాడు.

sukumar-4

ఇండస్ట్రీతో పాటు అభిమానులు ముద్దుగా సుక్కూ అని పిలుచుకునే ఈ విలక్షణ దర్శకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తోంది జీ-సినిమాలు.