DSP తప్ప ఇంకో ఆప్షన్ లేదు

Thursday,October 31,2019 - 10:02 by Z_CLU

టాలీవుడ్ లో ఇద్దరు దర్శకులకి DSP తప్ప ఇంకో ఆప్షన్ తెలీదు. ఏ స్టార్ తో సినిమా చేసిన తన మ్యూజిక్ పార్ట్ నర్ ని మాత్రం అస్సలు మార్చట్లేదు. కరియర్ బిగిన్ అయినప్పటి నుండి ఒక్క దేవి శ్రీ ప్రసాద్ తప్ప ఇంకో ఆప్షన్ కి ప్రిఫరెన్స్ కూడా ఇవ్వట్లేదు.

కొరటాల మెగాస్టార్ 152 సినిమాకి ఈసారి కొరటాల కొత్త మ్యూజిక్ డైరెక్టర్ తో పని చేయబోతున్నాడనుకున్నారంతా. అలా అనుకోవడానికి రీజన్ ఉంది. ‘సైరా’ సినిమాకి బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్స్ పని చేయడంతో మెగాస్టార్ ఈసారి కూడా బాలీవుడ్ కే ప్రిఫరెన్స్ ఇస్తాడనుకున్నారు. కానీ ఫైనల్ గా కొరటాల ఆల్ టైమ్ మ్యూజిక్ పార్ట్ నర్ దేవి శ్రీ ప్రసాద్ నే ఎంచుకున్నాడు.

సుకుమార్ కూడా కథ ఏదైనా.. స్టార్ ఎవరైనా మ్యూజిక్ వరకు వచ్చేసరికి ఇంకో ఆలోచనకి కూడా ఆప్షన్ ఇవ్వడు దేవి శ్రీ ప్రసాద్ ఉండాల్సిందే. ఇప్పుడు సెట్స్ పైకి రావడానికి రెడీ అవుతున్న అల్లు అర్జున్ సినిమాకి కూడా DSP నే మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

సాధారణంగా DSP లాంటి స్టార్ మ్యూజిక్ కంపోజర్ ని రీప్లేస్ చేయాలనే ఆలోచన అంత ఈజీగా రాదు కానీ, ఒక్కోసారి డిఫెరెంట్ గా ట్రై చేద్దామనే ఆలోచనతో అయినా, టెక్నీషియన్స్ ని మారుస్తుంటారు మేకర్స్. కానీ వీళ్ళిద్దరూ మాత్రం DSP తప్ప అసలు ఇంకో ఆప్షనే లేదు అన్న తరహాలో స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నారు.