చిరంజీవికి సిస్టర్ గా ఆ నటి?

Monday,June 22,2020 - 12:46 by Z_CLU

ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో ‘ఆచార్య’ సినిమా చేస్తున్న మెగాస్టార్ త్వరలోనే ‘లూసిఫర్’ రీమేక్ లో నటించబోతున్న సంగతి తెలిసిందే. సుజీత్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచి మంచి కలెక్షన్స్ సాధించిన ఈ కమర్షియల్ సినిమాను తెలుగులో కూడా ప్రేక్షకాదరణ పొందేలా రూపొందించాలనే ప్లానింగ్ జరుగుతుంది.

అయితే సినిమాలో చిరు సిస్టర్ క్యారెక్టర్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఆ రోల్ కి సుహాసిని బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారట మెగాస్టార్. ఇంకా ఫైనల్ అవ్వలేదు కానీ దాదాపు ఆ పాత్రకు సుహాసిని నే తీసుకొనే అవకాశం ఉంది.

గతంలో చిరంజీవి సరసన ఛాలెంజ్, మరణమృదంగం, ఆరాధన, రాక్షసుడు లాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించారు సుహాసిని. త్వరలోనే టోటల్ కాస్టింగ్ ఫైనల్ చేసి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కి ఫుల్ స్టాప్ ఇవ్వబోతున్నాడు సుజీత్. ‘ఆచార్య’ షూటింగ్ పూర్తయిన వెంటనే ఈ రీమేక్ ను స్టార్ట్ చేస్తారు.