Sudheer Varma - ఫిమేల్ సెంట్రిక్

Monday,November 09,2020 - 01:03 by Z_CLU

శర్వానంద్ ‘రణరంగం’ తర్వాత Sudheer Varma కొంచెం గ్యాప్ తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడీ దర్శకుడు ఓ ఫీమేల్ సెంట్రిక్ సినిమాతో రాబోతున్నాడు. కొరియన్ లో సూపర్ హిట్టైన ఓ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు సుధీర్ వర్మ.

Nivetha Thomas , Regina లను ఈ రీమేక్ కోసం సెలెక్ట్ చేసుకొని ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టాడు దర్శకుడు.

థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కనున్న ఈ సినిమాను Suresh Productions, Guru Films బ్యానర్ పై సురేష్ బాబు , సునీత సంయుక్తంగా నిర్మించనున్నారు. త్వరలోనే షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే మరిన్ని డీటెయిల్స్ తెలియజేయనున్నారు మేకర్స్.