సుధీర్ బాబు సరసన మణిరత్నం హీరోయిన్

Saturday,November 04,2017 - 11:07 by Z_CLU

బ్యాక్ టు బ్యాక్ వరుసగా 5 సినిమాలు ఎనౌన్స్ చేశాడు హీరో సుధీర్ బాబు. వీటిలో ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమా కూడా ఉంది. అమీతుమీ తర్వాత మరోసారి గ్యాప్ తీసుకున్న ఈ దర్శకుడు.. తన నెక్ట్స్ ప్రాజెక్టును సుధీర్ బాబు హీరోగా చేయబోతున్నాడు. ఈ సినిమాలో నటించే హీరోయిన్ ను తాజాగా ఫిక్స్ చేశారు.

మణిరత్నం తీసిన చెలియా సినిమాలో మెరిసిన అదితిరావును ఈ సినిమాలో సుధీర్ బాబుకు హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రానుంది. అమీతుమీ లాంటి కంప్లీట్ కామెడీ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించిన ఇంద్రగంటి.. సుధీర్ బాబు సినిమా కోసం ఇప్పటివరకు టచ్ చేసిన ఓ డిఫరెంట్ సబ్జెక్ట్ ను సెలక్ట్ చేసుకున్నాడు.

మణిరత్నం నటించిన చెలియా సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచమయైన అదితి రావుకు ఇదే తొలి తెలుగు స్ట్రయిట్ మూవీ. ఈ మూవీ స్టోరీలైన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని ప్రకటించింది అదితి రావు.