Sridevi Soda Centre - రిస్క్ తీసుకున్న సుధీర్ బాబు

Thursday,August 26,2021 - 03:23 by Z_CLU

‘పలాస 1978’ ఫేం కరుణ కుమార్ డైరెక్షన్ లో ‘శ్రీదేవి సోడా సెంటర్’ అనే సినిమా చేశాడు సుధీర్ బాబు. 70mm ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమా రేపే థియేటర్స్ లోకి రానుంది. సినిమాను అందరూ చూడాలనే ఉద్దేశ్యంతో మేకర్స్ భారీ రిలీజ్ ప్లాన్ చేశారు. ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై అటు ట్రేడ్ లో ఇటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి.

అయితే ఈ సినిమా కోసం సుదీర్ బాబు చాలా రిస్క్ తీసుకున్నాడు. సినిమాలో బోట్ రేసింగ్ ఉంటుంది. ఆ యాక్షన్ ఎపిసోడ్స్ లో డూప్ వాడకుండా తనే స్వయంగా జంపింగ్ లు చేశాడు. తాజాగా టీంతో ప్రభాస్ ఇంటర్వ్యూ రిలీజ్ చేశారు మేకర్స్. ఆ వీడియోలో యాక్షన్ సీక్వెన్స్ లో రిస్కీ షాట్స్ వేస్తూ ఈ సినిమా కోసం సుదీర్ బాబు ఎంతగా కష్టపడ్డాడో చూపించారు. ఒక పడవ నుండి మరో పడవకి దూకబోయి సుదీర్ కింద పడిన సందర్భాలు ఉన్నాయని ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది.

Sridevi Soda Center – ప్రభాస్ ఇంటర్వ్యూ

కెరీర్ ఆరంభం నుండి హీరోగా తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్ అందుకోవాలని ట్రై చేస్తూనే ఉన్నాడు సుదీర్. ఎప్పటికప్పుడు విభిన్న కథలతో సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఇప్పుడు శ్రీదేవి సోడా సెంటర్ కూడా తనకి సరికొత్త గుర్తింపు తెస్తుందని భావిస్తున్నాడు. మన తెలుగు నేటివిటీ కథతో సుదీర్ బాబు చేసిన ఈ ప్రయత్నం రేపు అతనికి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.

ఫస్ట్ గ్లిమ్స్ తోనే అందరినీ ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమాపై మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సెన్సార్ నుండి కూడా మంచి టాక్ రావడంతో ఆడియన్స్ కూడా సినిమా చూసేందుకు వెయిట్ చేస్తున్నారు. రేపటి నుండి శ్రీదేవి సోడా సెంటర్ థియేటర్స్ లో సందడి చేయనుంది.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics