#Sudheer15 - హర్ష వర్ధన్ తో సుదీర్ బాబు!

Monday,July 12,2021 - 01:55 by Z_CLU

ప్రస్తుతం ‘శ్రీదేవి సోడా సెంటర్’, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాల్లో హీరోగా నటిస్తున్న సుదీర్ బాబు తాజాగా మరో సినిమా ఎనౌన్స్ చేశాడు. నటుడు , రచయిత హర్ష వర్ధన్ దర్శకత్వంలో #Sudheer15 సినిమా చేయబోతున్నాడు. తాజాగా ఈ సినిమాను ఎనౌన్స్ చేసి ఆగస్ట్ నుండి షూటింగ్ మోదలు కానుందని తెలియజేశారు మేకర్స్. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బేనర్ పై నారాయణ్ దాస్ , రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మించబోతున్నారు.

harsha vardhan

హర్షవర్ధన్ రచయితగా పలు సినిమాలు చేశాడు. మనం సినిమా అతనికి డైలాగ్ రైటర్ గా మంచి పేరుతో పాటు అవార్డు కూడా అందించింది. ఇక దర్శకుడిగా హర్షవర్ధన్ రెండు సినిమాలు చేశాడు. ఇటివలే ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే సినిమా తీశాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీగా ఉంది. రైటర్ గా కొన్ని సినిమాలకు వర్క్ చేస్తూనే తను రాసుకున్న ఓ స్క్రిప్ట్ నిర్మాతలకు చెప్పి ఇటివలే సుదీర్ బాబు కి వినిపించాడు.

sudheer babu harsha vardhan movie

హర్షవర్ధన్ నరేట్ చేసిన స్క్రిప్ట్ బాగా నచ్చడంతో తన అప్ కమింగ్ సినిమాల లిస్టులో ఈ సినిమాను చేర్చేశాడు సుదీర్ బాబు. ప్రస్తుతం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే సినిమా షూటింగ్ తో బిజీ గా ఉన్న సుదీర్ వచ్చే నెల నుండి హర్షవర్ధన్ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు. క్రేజీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా టైటిల్ తో పాటు మిగతా వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. సుదీర్ సరసన కొత్తమ్మాయిని హీరోయిన్ గా తీసుకునే ప్లానింగ్ లో ఉన్నాడు హర్షవర్ధన్. త్వరలోనే హీరోయిన్ ని ఫైనల్ చేసి ఎనౌన్స్ చేస్తారు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics