సుధీర్ బాబు ఆడబోతున్నాడట..

Tuesday,July 26,2016 - 05:03 by Z_CLU

 

భలే మంచి రోజు సక్సెస్ తర్వాత హీరో సుధీర్ బాబు తెలుగులో మరే సినిమా ఒప్పుకోలేదు. బాలీవుడ్ లో ఓ సినిమా చేసినప్పటికీ… అది పూర్తయిన తర్వాత కూడా గ్యాప్ తీసుకోవడానికే ఇష్టపడ్డాడు సుధీర్ బాబు. ఎట్టకేలకు ఈ ప్రేమకథాచిత్రమ్ హీరో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అది కూడా ఓ బయోపిక్ ఆధారంగా తెరకెక్కబోతోందని సమాచారం.

బాడ్మింటన్ స్టార్ పుల్లెల గోపీచంద్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న చిత్రంలో నటించేందుకు సుధీర్ బాబు ఒప్పుకున్నాడట. స్వతహాగా బాడ్మింటన్ క్రీడాకారుడైన సుధీర్ బాబుకు… పుల్లెల గోపీచంద్ బయోపిక్ లో నటించాలనే కోరిక ఎప్పట్నుంచో ఉంది. దర్శకుడు ప్రవీణ్ సత్తార్ రూపంలో ఆ చిరకాల వాంఛ నెరవేరబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనిమీద ప్రవీణ్ బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ డ్రీమ్ ప్రాజెక్టు వివరాలు బయటకురానున్నాయి.