Sudheer Babu Movie - రచయితకు ఛాన్స్ ఇచ్చిన హీరో

Tuesday,December 21,2021 - 10:15 by Z_CLU

Sudheer Babu Harshavardhan Movie Launched

ప్ర‌స్తుతం ప‌లు ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ల‌తో మ‌న ముందుకు రాబోతున్నారు హీరో సుధీర్ బాబు. తన కెరీర్‌లో 15వ చిత్రంగా హర్షవర్ధన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నారు. సోనాలి నారంగ్‌, సృష్టి స‌మ‌ర్ఫ‌ణ‌లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.5గా  నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సుధీర్ బాబు కోసం ఒక భిన్న‌మైన క‌థ‌ను రెడీ చేశారు ద‌ర్శ‌కుడు హ‌ర్ష వ‌ర్ధ‌న్‌. ఈ సినిమాలో ఇంత వ‌ర‌కూ చూడ‌ని స‌రికొత్త అవతారంలో సుధీర్ బాబు క‌నిపించ‌నున్నారు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం హైద‌రాబాద్‌లో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది.

ముహూర్త‌పు షాట్‌కు నిర్మాత పుస్కుర్‌ రామ్‌మోహ‌న్ రావు క్లాప్ కొట్టి  స్క్రిప్ట్‌ను ద‌ర్శ‌కుడికి అంద‌జేశారు. వ‌చ్చే వారం నుండి ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభంకానుంది.

ఇంకా పేరు పెట్ట‌ని ఈ చిత్రంలో ప్ర‌ముఖ న‌టీన‌టులు కీల‌క పాత్ర‌ల‌లో న‌టించ‌నున్నారు. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం స‌మ‌కూరుస్తుండ‌గా పీజీ విందా సినిమాటోగ్ర‌ఫి భాధ్య‌తలు  నిర్వ‌హిస్తున్నారు. రాజీవ్ ఆర్ట్ డైరెక్ట‌ర్. ఇత‌ర న‌టీన‌టులు సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వ‌ర‌లో తెలుప‌నున్నారు.

న‌టీన‌టులు: సుధీర్ బాబు
సాంకేతిక వ‌ర్గం:
ర‌చ‌న‌,ద‌ర్శ‌క‌త్వం: హ‌ర్ష వ‌ర్ధ‌న్‌
నిర్మాత‌లు: నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు
స‌మ‌ర్ప‌ణ‌: సోనాలి నారంగ్‌, సృష్టి
బ్యాన‌ర్‌: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి
సంగీతం: చైత‌న్ భ‌ర‌ద్వాజ్
డిఓపి: పీజీ విందా
ఆర్ట్‌: రాజీవ్‌
పిఆర్ఓ: వంశీ – శేఖ‌ర్‌