మహేష్ తో సినిమా పై క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరో ...

Sunday,July 09,2017 - 12:08 by Z_CLU

సూపర్ స్టార్ కృష్ణ ఫామిలీ నుంచి మహేష్ తర్వాత హీరోగా పరిచయమైన హీరో.. సుధీర్ బాబు. ప్రెజెంట్ పర్ఫెక్ట్ క్యారెక్టర్స్ తో మెస్మరైజ్ చేస్తూ హీరోగా వరుస ఆఫర్స్ అందుకుంటూ దూసుకెళ్తున్న ఈ యంగ్ హీరో ఇటీవలే బాలీవుడ్ లో విలన్ గా కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. విలన్ గా బాలీవుడ్ లో ఓ మోస్తరు క్రేజ్ సంపాదించుకున్న సుధీర్ త్వరలోనే మహేష్ బాబు సినిమాలో ఓ కీ రోల్ చేయనున్నాడనే వార్త ప్రస్తుతం టాలీవుడ్లో చక్కర్లు కొడుతుంది. అయితే లేటెస్ట్ గా మహేష్ తో సినిమా అన్న వార్త పై స్పందించాడు సుధీర్.

సుధీర్ తన ఫామిలీ హీరో కావడంతో ప్రతీ సినిమాను తన సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ ద్వారా ప్రమోట్ చేస్తూ అప్పుడప్పుడు ప్రమోషన్స్ లో పాల్గొంటూ విష్ చేస్తుంటాడు మహేష్. అయితే ఈ రిలేషన్ షిప్ తోనే త్వరలో సుధీర్ మహేష్ నెక్స్ట్ సినిమాలో ఓ కీ రోల్ చేయనున్నాడనే టాక్ వచ్చింది. లేటెస్ట్ గా ‘శమంతకమణి’ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూ లో మహేష్ సినిమాలో కీ రోల్ అనే వార్త పై మాట్లాడాడు సుధీర్.ప్రస్తుతానికి అలాంటిదేం లేదని, కానీ మహేష్ సినిమాలో కీ రోల్ కాకపోయినా మహేష్ తో జస్ట్ ఒక్క ఫ్రేమ్ లో కనిపించిన చాలనుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. సో మహేష్ సినిమాలో కీ రోల్ అన్నది నిజం కాదని ఇలా తేల్చేశాడు ఈ యంగ్ హీరో.