Sridevi Soda Center - మహేష్ చెప్పిన సినిమా ఇదే

Sunday,August 22,2021 - 02:21 by Z_CLU

శ్రీదేవి సోడా సెంటర్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. ఈవెంట్ లో సుధీర్ బాబు మాట్లాడుతూ.. మహేష్ ఎప్పుడూ చెప్పే సినిమా ఇదే అన్నాడు.

“మహేష్ బాబు గారిని నేను ఎంతో అభిమానిస్తాను. నేను ఆయనకు థాంక్స్ చెప్పి దూరం చేసుకోలేను. మహేష్ ఒక ఫంక్షన్ లో మాట్లాడుతూ సుధీర్ కు కరెక్ట్ సినిమా పడితే ఒక నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాడు అన్నాడు. ఆయన అన్న సినిమా ఇదే అవుతుంది అనుకుంటున్నాను నేను. దర్శకుడు పలాస చిత్రాన్ని చాలా బాగా తెరకెక్కించాడు. పలాస కంటే శ్రీదేవి సోడా సెంటర్ ఇంకా చాలా బాగుంటుంది. ఇందులోసూరిబాబు రోల్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు కి సూరిబాబు, శ్రీదేవి జ్ఞాపకాలు మాత్రం అలాగే ఉంటాయి.వాళ్ల కోసం మళ్ళీ ఈ సినిమా చూడ్డానికి థియేటర్ కు వస్తారు ఈ సినిమా అంత బాగా ఉంటుంది. గోదావరి జిల్లా బ్యాక్ డ్రాప్ లో వస్తున్న కథ ఇది. గోదావరి భాషలో చెప్పాలంటే ఇది మంచి పులస లాంటి సినిమా ఇప్పుడు సీజన్ కూడా పులస సీజనే..అదే సీజన్లో ఈ సినిమా వస్తోంది. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.నేను రొటీన్ సినిమాలు చెయ్యను డిఫరెంట్ గా ఉండే కథల్ని సెలెక్ట్ చేసుకుని చేస్తాను. ఎందుకు చెప్పానో ఈ నెల 27న రిలీజ్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది. ఈ సినిమా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది.”