Sudheer Babu - ఆ దర్శకుడితో మూడోసారి

Sunday,November 15,2020 - 01:32 by Z_CLU

ఒక హీరోతో సింక్ అయితే ఆ చిత్ర దర్శకుడు అతనితో రెండో సినిమా చేయడం సహజమే. కానీ వరుసగా అతనితో మూడు సినిమాలు చేస్తే మాత్రం డైరెక్టర్ కి హీరో ఫేవరేట్ అయిపోయాడనుకోవాలి. అవును దర్శకుడు Indraganti Mohana krishna – SudheerBabu కాంబో చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. సుదీర్ బాబు తో మొదటి సారి Sammohanam సినిమా చేసిన ఇంద్రగంటి ఆ వెంటనే తను తీసిన థ్రిల్లర్ సినిమాలో Nani తో పాటు సుదీర్ కి కూడా చోటిచ్చాడు. అయితే ఇప్పుడు ముచ్చటగా మూడో సారి సుదీర్ ని డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు ఇంద్రగంటి.

నెక్స్ట్ సుదీర్ బాబు తో ఓ రొమాంటిక్ సినిమా చేస్తున్నాడు మోహన కృష్ణ. ఈ సినిమా వచ్చే నెల నుండి సెట్స్ పైకి వెళ్ళబోతుంది. సుదీర్ సరసన Krithi Shetty ను హీరోయిన్ గా ఫైనల్ చేసిన దర్శకుడు ప్రస్తుతం సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాడు. మరి ఈ కాంబోలో రానున్న మూడో సినిమా ఎలాంటి హిట్ సాధిస్తుందో తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే.