డైరెక్టర్ గా మారనున్న సక్సెస్ ఫుల్ రచయిత

Thursday,July 20,2017 - 12:39 by Z_CLU

గతంలో పూల రంగడు, లౌక్యం, సర్దార్ గబ్బర్ సింగ్, డిక్టేటర్ లాంటి సక్సెస్ ఫుల్ సినిమాలకు డైలాగ్స్ రాసిన శ్రీధర్ సీపాన మెగాఫోన్ పట్టుకోబోతున్నాడు. ఇప్పటి వరకు డైలాగ్స్ తో ఎట్రాక్ట్ చేసిన ఈ రచయిత అల్టిమేట్ హిలేరియస్ ఎంటర్ టైనర్ తో రెడీ అవుతున్నాడు.

పస్తుతం స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసుకున్న శ్రీధర్, సినిమాకి సంబంధించిన తక్కిన నటీనటుల సెలెక్షన్ ప్రాసెస్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అల్టిమేట్ కామెడీ, ఇమోషనల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకి సంబంధించిన తక్కిన డీటేల్స్ శ్రీధర్ పుట్టిన రోజు సందర్భంగా జూలై 29 న తక్కిన డీటేల్స్ ని అనౌన్స్ చేయనుంది సినిమా యూనిట్.