స్పీడ్ పెంచనున్న బన్నీ !

Sunday,August 18,2019 - 12:22 by Z_CLU

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురములో’ సినిమా చేస్తున్న అల్లు అర్జున్ ఇక నుంచి స్పీడ్ పెంచబోతున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా సెట్స్ పై ఉండగానే సుకుమార్ తో చేయనున్న నెక్స్ట్ సినిమాను స్టార్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇదే నెలలో గ్రాండ్ గా లంచ్ కానుంది. ఇప్పటికే ఓ ముహూర్తం కూడా ఖరారైనట్టు తెలుస్తుంది.

అయితే సుకుమార్ సినిమా ప్రారంభం అయితే చేస్తాడు కానీ షూట్ వెంటనే ఉండదు. ఇంకా టైం పడుతుంది. కానీ పెద్దగా గ్యాప్ లేకుండానే ఈ సినిమాను కూడా ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు స్టైలిష్ స్టార్. ఈ సినిమా తర్వాత వేణు శ్రీరాం ‘ఐకాన్’ స్క్రిప్ట్ తో రెడీ గా ఉన్నాడు. సుకుమార్ సినిమా సెట్స్ పై ఉండగానే ఈ సినిమాను కూడా స్టార్ట్ చేస్తాడని అంటున్నారు. ఇలా వరుసపెట్టి ఒకదానికి వెనుక మరో సినిమాను రిలీజ్ చేస్తూ అనుకోకుండా తీసుకున్న గ్యాప్ ని ఫ్యాన్స్  మర్చిపోయేలా చేయబోతున్నాడు బన్నీ