అల్లు అర్జున్ కి ఘన సన్మానం

Monday,October 29,2018 - 02:18 by Z_CLU

బెంగళూరు లోని నాగార్జున కాలేజ్ ఆఫ్ ఇంజినీరిగ్  స్టైలిష్ స్టార్ ని ఘనంగా సత్కరించింది. ఈ నెల 27 న జరిగిన కల్చరల్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యాడు అల్లు అర్జున్. ఈ సందర్భంగా స్టూడెంట్స్ ని ఉద్దేశించి మాట్లాడిన అల్లు అర్జున్, తాను చదువుకునే రోజుల్లో అనుభవాలను అక్కడ ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నాడు.

తను స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఎప్పుడూ లాస్ట్ ర్యాంక్ తెచ్చుకునే వాడినని చెప్పుకున్న అల్లు అర్జున్, కల్చరల్  ఈవెంట్స్ లో మాత్రం చాలా ఎగ్జైటెడ్ గా పార్టిసిపేట్ చేసేవాడినని చెప్పుకున్నాడు. చదువు అనేది అందరి హక్కు అని  చెప్పిన  బన్ని, ఈ ఈవెంట్ కి ఇన్వైట్ చేసినందుకు కాలేజ్ యాజమాన్యానికి థాంక్స్ చెప్పుకున్నాడు.

అల్లు అర్జున్ ఈ ఈవెంట్ కి అటెండ్ అవ్వడం వల్ల స్టూడెంట్స్ లో మరింత జోష్ నిండింది. స్పెషల్ గా బన్ని స్టైలిష్ లుక్స్ ఫ్యాన్స్ ని టోటల్ గా మెస్మరైజ్ చేస్తున్నాయి.