షూటింగ్ అప్ డేట్స్

Wednesday,October 11,2017 - 10:03 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని క్రేజీ సినిమాలు షూటింగ్ స్టేజ్ నుంచే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. కొన్ని టైటిల్స్ తో ఆకట్టుకుంటుంటే..మరికొన్ని టెక్నీషియన్స్ తో, ఇంకొన్ని కథలతో ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న అలాంటి కొన్ని సినిమాల్ని చూద్దాం

 

నా పేరు సూర్య

బన్నీ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా నా పేరు సూర్య. రామలక్ష్మీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్. ఈ సినిమాకు సంబంధించి తాజాగా మరో షెడ్యూల్ కంప్లీట్ అయింది. గతనెల 24న ఊటీలో ప్రారంభమైన షెడ్యూల్ ఇవాళ్టితో ముగిసింది. నెక్ట్స్ షెడ్యూల్ డీటెయిల్స్ త్వరలోనే తెలుస్తాయి.

2.0

సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 2.0 సినిమా ఫైనల్ షెడ్యూల్ మోడ్ లోకి ఎంటరైంది. ఈ సినిమాకు సంబంధించి టాకీ పార్ట్ కంప్లీట్ అయింది. ఒక్క సాంగ్ మాత్రం పెండింగ్ ఉంది. ఆ ఒక్క పాటను రేపట్నుంచి ముంబయిలో షూట్ చేయబోతున్నారు. దీంతో 2.0 షూటింగ్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ప్రస్తుతం ఈ సాంగ్ కోసమే అమీ జాక్సన్ రిహార్సల్స్ తో బిజీగా ఉంది.

 

కళ్యాణ్  రామ్ సినిమా

నందమూరి హీరో కళ్యాణ్  రామ్ ఇప్పుడు ఒకేసారి 2 సినిమాల్ని సైమల్టేనియస్ గా పూర్తిచేస్తున్నాడు. వీటిలో ఒకటి జయేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతోంది. తమన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేసుంది. ఈ షెడ్యూల్ లో దాదాపు 40శాతం టాకీ కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. పీసీ శ్రీరామ్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్. కళ్యాణ్  రామ్ నటిస్తున్న ఫుల్ లెంగ్త్ లవ్ సబ్జెక్ట్ ఇది.

 

కాలా

కబాలి తర్వాత దర్శకుడు పా.రంజిత్ కు మరోసారి అవకాశమిచ్చాడు రజనీకాంత్. ప్రస్తుతం వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కాలా సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. ముంబయిలోని ధారావిని పోలిన సెట్ ను చెన్నైలో వేశారు. అదే సెట్ లో రజనీకాంత్ పై ఓ సాంగ్ ను పిక్చరైజ్ చేస్తున్నారు.

 

 

రాజుగాడు

రాజ్ తరుణ్ లేటెస్ట్ మూవీ రాజుగాడు. సంజనా రెడ్డిని దర్శకురాలిగా పరిచయం చేస్తూ ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా.. 2 పాటలు మినహా పూర్తయింది. పెండింగ్ లో ఉన్న 2 పాటల్లో ఒక పాట షూటింగ్ ను తాజాగా ప్రారంభించారు. హైదరాబాద్ అన్నపూర్ణ స్టుడియోస్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఈ సాంగ్ షూటింగ్ జరుగుతోంది.