స్టూడియో రౌండప్
Tuesday,April 03,2018 - 03:04 by Z_CLU

సవ్యసాచి
ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది నాగ చైతన్య – చందూ మొండేటి సినిమా. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో చైతు సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ షెడ్యూల్ తరవాత, నెక్స్ట్ షెడ్యూల్ ని అమెరికాలో ప్లాన్ చేస్తుంది సినిమా యూనిట్. ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది.

నాగార్జున -నాని మల్టీస్టారర్
రీసెంట్ గా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న నాగార్జున, నాని మల్టీస్టారర్. అల్టిమేట్ హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా సెకండ్ షెడ్యుల్ నిన్నటి నుండి బిగిన్ అయింది. ఈ షెడ్యుల్ లో నాగార్జున, నాని కాంబినేషన్ లో సినిమాలోని కీలక సన్నివేశాలు తెరకెక్కించే ప్రాసెస్ లో ఉన్నారు ఫిల్మ్ మేకర్స్. శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వనీ దత్ నిర్మిస్తున్నారు. మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

సైరా
ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ క్రేజీయెస్ట్ మూవీ ‘సైరా..’. మెగాస్టార్ చిరంజీవి సరసన నయనతార ఈ సినిమాలో నటిస్తుంది. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ రోల్ ప్లే చేస్తుండటంతో అంచనాలు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. అయితే రీసెంట్ గా అమితాబ్, చిరు, నయనతార కాంబినేషన్ లో పెళ్ళి సన్నివేశాలను చిత్రీకరించిన సినిమా యూనిట్, ప్రస్తుతం హైదరాబాద్ లో నానక్ రామ్ గూడాలోని రామానాయుడు స్టూడియోలో, సినిమాలోని మరిన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించే ప్రాసెస్ లో ఉంది.

రానా దగ్గుబాటి – టైగర్ నాగేశ్వరరావు
వంశీ కృష్ణ డైరెక్షన్ లో రానా దగ్గుబాటి నటించనున్న సినిమా ఏప్రిల్ 9 నుండి రెగ్యులర్ షూటింగ్ జపాన్ లో ప్రారంభం కానుందని సమాచారం . టైగర్ నాగేశ్వర్రావు కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాను AK ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపొందనుంది.

శర్వానంద్ -హను పడి పడి లేచె మనసు
హను రాఘవపూడి డైరెక్షన్ లో శర్వానంద్ ‘పడి పడి లేచె మనసు’ రీసెంట్ గా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. నెల రోజులపాటు కలకత్తాలో జరిగిన ఈ ఈ భారీ షెడ్యూల్ లో సినిమాలోని కీలక సన్నివేశాలను తెరకెక్కించిన సినిమా యూనిట్, ప్రస్తుతం బ్రేక్ మోడ్ లో ఉంది. శర్వానంద్ సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు హను రాఘవపూడి డైరెక్టర్. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై ప్రసాద్ చుక్కలపల్లి, సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ బిగిన్ కానుంది.