స్టూడియో రౌండప్

Thursday,March 29,2018 - 01:10 by Z_CLU

సాక్ష్యం 

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ – శ్రీవాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘సాక్ష్యం’ సినిమా ఫైనల్ షెడ్యుల్ ప్రస్తుతం హైదరాబాద్ గండిపేట్ లో జరుగుతుంది. బెల్లంకొండ ఇతర నటీనటుల మీద కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యుల్ తో సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తి కానుంది.

 

నేల టిక్కెట్టు

రవితేజ అప్ కమింగ్ మూవీ  ‘నేల టిక్కెట్టు’ షూటింగ్ ప్రస్తుతం రాజేంద్రనగర్ సమీపంలో ఓ క్వారీ వద్ద జరుగుతుంది. రవితేజ తో పాటు మరికొందరు నటీనటులపై షూట్ జరుగుతుంది. ఇదొక యాక్షన్ సీక్వెన్స్.

శ్రీనివాస కళ్యాణం 

సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో నితిన్ నటిస్తున్న శ్రీనివాస కళ్యాణం లేటెస్ట్ గా ఫస్ట్ షెడ్యుల్ పూర్తిచేసుకుంది. అమలాపురం సమీపంలో దాదాపు 15 రోజుల పాటు జరిగిన మొదటి షెడ్యుల్ లో నితిన్ , నందిత శ్వేత, రాశి ఖన్నా మిగతా నటీనటుల పై కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేశారు. రెండో షెడ్యుల్ ఏప్రిల్ రెండో వారం నుండి చండీఘర్ లో ప్రారంభమౌతుంది.

 

నాగ్-నాని మల్టీస్టారర్

వైజయంత్రీ మూవీస్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ సినిమా. తాజాగా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. మొదటి షెడ్యూల్ లో భాగంగా హైదరాబాద్ మెట్రో రైలులో ఈ సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలు తీశారు. ఇందులో సంపూర్ణేష్ బాబు ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

నా పేరు సూర్య

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న నా పేరు సూర్య సినిమా షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టుడియోస్ లో జరుగుతోంది. ఇప్పటికే 80శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు సంబంధించి కొన్ని మాంటేజ్ షాట్స్ తీస్తున్నారు. ఈ గ్యాప్ లో దర్శకుడు వక్కంతం వంశీ ముంబయి వెళ్లాడు. సినిమా రీ-రికార్డింగ్ పనులు అక్కడ జరుగుతున్నాయి.

 

భరత్ అనే నేను

మహేష్ బాబు, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా భరత్ అనే నేను. అల్యూమినియం ఫ్యాక్టరీ వద్ద ఏర్పాటుచేసిన ప్రత్యేకమైన సెట్ లో నిన్నటి వరకు ఈ మూవీకి సంబంధించి షూటింగ్ చేశారు. మరో షెడ్యూల్ కోసం యూనిట్ స్పెయిన్ వెళ్లింది. ప్రస్తుతం స్పెయిన్ లో షూటింగ్ నడుస్తోంది.

 

అమర్ అక్బర్ ఆంటోనీ

రవితేజ ట్రిపుల్ రోల్ లో కనిపించబోతున్న సినిమా ఇది. శ్రీనువైట్ల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ అమెరికాలో ప్రారంభమైంది. అయితే హీరో రవితేజ, హీరోయిన్ అను ఎమ్మాన్యుయేల్ మాత్రం ఇంకా షూటింగ్ లో జాయిన్ అవ్వలేదు. ఇతర కీలకపాత్రలపై సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.