సిల్వర్ స్క్రీన్ – స్ట్రాంగ్ విమెన్

Friday,September 27,2019 - 10:02 by Z_CLU

అది హిస్టారికల్ మూవీ అయినా… భారీ కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ప్రెస్టీజియస్ సినిమా ఆయినా సిల్వర్ స్క్రీన్ పై స్ట్రాంగ్ విమెన్ రోల్స్ రూల్ చేస్తున్నాయనిపిస్తుంది. సినిమాలో హీరో క్యారెక్టర్స్ కి ధీటుగా ఈ క్యారెక్టర్స్ ని ప్రెజెంట్ చేస్తున్నారు దర్శకులు.

సిద్ధమ్మ : ‘సైరా’ నరసింహా రెడ్డి భార్య సిద్ధమ్మ. ఈ సినిమాలో మెగాస్టార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ, మేకర్స్ నయనతార ప్లే చేసిన ఈ క్యారెక్టర్ కి ఇస్తున్న హైప్ చూస్తుంటే ఈ సిద్ధమ్మ జస్ట్ రాయాల్టీకే కాదు… సినిమాలోని కీలక సన్నివేశాల్లో మరింత స్ట్రాంగ్ గా నిలబడే డెసిషన్ మేకర్ గా కనిపిస్తోంది.

లక్ష్మి :  తమన్నా ప్లే చేసింది ఈ క్యారెక్టర్ ని. ఇప్పుడు రిలీజైన ఓ సింగిల్ లో గమనించినా, ట్రైలర్ లో తమన్నా ఎక్కడ కనిపించినా, కంటి నిండా రౌద్రం కనిపిస్తుంది. సినిమాలో ఎగ్జాక్ట్ గా ఈ క్యారెక్టర్ ఎక్కడ ఉండబోతుందన్నది ప్రస్తుతానికి డిస్కస్ చేయడం కష్టమైనా, కథలో మాత్రం హెవీ ఇంపాక్ట్ క్రియేట్ చేసే క్యారెక్టర్ అని అర్థమవుతుంది.

 

సావిత్రి: ‘ఓ బేబీ’ లో సమంతా ప్లే చేసిన రోల్. సినిమా మొత్తం ఎంటర్టైనింగ్ గా సాగినా, కథ మొత్తం ఈ క్యారెక్టర్ కి ఉన్న స్ట్రెంత్ నే ఎలివేట్ చేస్తుంది. ఒక్క ఆవకాశం దొరికితే ‘బేబీ’ లా మళ్ళీ కంప్లీట్ గా బ్రతికేయాలనుకునే ఈ సావిత్రి, తన లైఫ్ లో ఎలాంటి సమస్య ఎదురైనా ఎంత స్ట్రాంగ్ గా నిలబడిందనేది ఎలివేట్ అవుతుంది.

భాగమతి: నిజానికి ఈ సినిమా వరకు వచ్చేసరికి ‘భాగమతి’ కన్నా IAS ఆఫీసర్ చంచల గురించే డిస్కస్ చేసుకోవాలి. ‘భాగమతి’ అనే హిస్టారికల్ క్యారెక్టర్ ని వాడుకుని ఇన్వెస్టిగేషన్ టీమ్ కి ఓ IAS ఆఫీసర్ ఎలా సహకరించిందనేది ఈ సినిమా థీమ్. ఈ క్యారెక్టర్ అనుష్క ప్లే చేసింది.

శివగామి:   బాహుబలి సినిమా అంటేనే శివగామి అనిపిస్తుంది. నిజానికి ఈ సినిమా కర్త కర్మ క్రియ రాజమౌళి అయితే మాహిష్మతి సామ్రాజ్యంలో క్రియేట్ అయ్యే ప్రతి కాన్ఫ్లిక్ట్ కి పిల్లర్ రీజన్ శివగామి. బాహుబలికి ముందు సిల్వర్ స్క్రీన్ పై ఇంత స్ట్రాంగ్ రోల్ క్రియేట్ అయి డికేడ్స్ గడిచింది. ఈ క్యారెక్టర్ లో రమ్యకృష్ణ బదులు ఇంకొకరిని కనీసం ఊహించుకోలేం అన్నంతగా ఇన్వాల్వ్ అయి నటించింది.