సరికొత్త క్యారెక్టర్స్ తో

Wednesday,March 22,2017 - 09:30 by Z_CLU

టాలీవుడ్లో ఈ ఇయర్ సరికొత్త ప్రయోగాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు కొందరు స్టార్ హీరోస్. కెరీర్ లో ఇప్పటి వరకూ కనిపించని డిఫరెంట్ క్యారెక్టర్స్ తో త్వరలోనే థియేటర్లలో హంగామా చేయబోతున్నారు.


‘ఖైదీ నంబర్ 150’ తో రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి త్వరలో ఓ ప్రయోగాత్మక క్యారెక్టర్ తో మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే క్యారెక్టర్ లో స్వాతంత్ర సమరయోధుడిగా కనిపించబోతున్నాడు చిరు.

ఇప్పటికే పలు ప్రయోగాత్మక క్యారెక్టర్స్ తో మెస్మరైజ్ చేసిన నాగ్ త్వరలోనే ‘మెంటలిస్ట్’ అనే మరో ప్రయోగాత్మక క్యారెక్టర్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.. ఓంకార్ దర్శకత్వం లో హారర్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న ‘రాజుగారి గది-2 ‘ సినిమాలో ఇప్పటి వరకూ చేయని ఓ డిఫరెంట్ క్యారెక్టర్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చూస్తున్నాడు నాగ్.


యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఈ ఇయర్ ఓ ప్రయోగాత్మక సినిమాతో ఆకట్టుకోవాాలని చూస్తున్నాడు. బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కనిపిస్తాడట ఎన్టీఆర్. వీటిలో ఓ నెగెటివ్ క్యారెక్టర్ కూడా ఉందట.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ ఇయర్ దర్శకుడు సుకుమార్ తో కలిసి ఓ ప్రయోగాత్మక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఎన్నో మాస్ క్యారెక్టర్స్ తో ఆకట్టుకొని భారీ హిట్స్ అందుకున్న చెర్రీ.. అప్ కమింగ్ మూవీలో వినికిడి లోపం గల పల్లెటూరి కుర్రాడిగా కనిపించబోతున్నాడట. ఇప్పటికే ఫస్ట్ లుక్ తో హాట్ టాపిక్ గా మారిన ఈ ప్రయోగాత్మక సినిమాతో చరణ్ ఎలాంటి హిట్ సాధిస్తాడో చూడాలి.

ఈ ఇయర్ రవితేజ కూడా ఓ ప్రయోగాత్మక సినిమాతో సరికొత్తగా ఎంటర్టైన్ చేయబోతున్నాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రానున్న ‘రాజా ది గ్రేట్’ సినిమాలో ఫస్ట్ టైం అంధుడి క్యారెక్టర్ చేస్తున్నాడు.

స్టార్ హీరోలే కాదు నేనూ ఓ ప్రయోగాత్మక సినిమాతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తా అంటూ అంధుడి గా ‘అంధగాడు’ సినిమాతో త్వరలోనే థియేటర్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు యంగ్ ఎనర్జిటిక్ హీరో రాజ్ తరుణ్.  వరుస హిట్స్ అందుకుంటున్న రాజ్ తరుణ్ కి ఈ సినిమా నిజంగా ఓ ప్రయోగాత్మక సినిమానే.