అన్నీ అక్కడే అంటున్న స్టార్లు

Saturday,November 12,2016 - 09:00 by Z_CLU

స్టార్ హీరోలు ఎప్పుడు ఎక్కడ ఉంటారో ఎవరూ గెస్ చేయలేరు. రెగ్యులర్ గా షూటింగ్ లతో బిజీగా ఉండే హీరోలు ఒకప్పుడు దేశం మొత్తం రౌండ్స్ కొట్టేవాళ్లు. కానీ ఇప్పుడు ఏకంగా ప్రపంచాన్నే చుట్టేస్తున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి యూరోప్ టూర్ లో ఉన్నాడు. తన ప్రతిష్టాత్మక సినిమా ఖైదీనంబర్ 150కు సంబంధించి రెండు పాటల షూటింగ్ కోసం క్రొయేషియా, స్లొవేనియా దేశాలకు పయనమయ్యాడు చిరు. ఇదే సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న రామ్ చరణ్ కూడా తండ్రితో పాటు యూరోప్ బాట పట్టాడు.

sai-dharam-tej-wallpapers-9

మరో మెగా హీరో సాాయిధరమ్ తేజ కూడా యూరోప్ టూర్ లోనే ఉన్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న విన్నర్ సినిమా షూటింగ్ కోసం ఉక్రెయిన్ వెళ్లాడు తేజు. టన్నెల్ ఆఫ్ లవ్ అనే టూరిస్ట్ స్పాట్ లో రకుల్ ప్రీత్ సింగ్ తో కలిసి ఓ పాటకు స్టెప్పులేస్తున్నాడు. మరో సీనియర్ హీరో నాగార్జున కూడా ప్రస్తుతం ఇండియాలో లేడు. తన ఫేవరెట్ స్పాట్ పారిస్ లో ఉన్నాడు కింగ్. ప్రస్తుతం రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఓం నమో వేంకటేశాయ సినిమా చేస్తున్న నాగార్జున… పారిస్ లో ఏం చేస్తున్నాడనేది మాత్రం సస్పెన్స్.

     రెగ్యులర్ గా ఫారిన్ ట్రిప్స్ ప్లాన్ చేసే పూరి జగన్నాధ్ కూడా ప్రస్తుతం బ్యాాంకాక్ లో తిష్టవేశాడు. తను ఎప్పుడు స్క్రీన్ ప్లే రాయాల్సి వచ్చినా బ్యాంకాక్ లో వాలిపోయే జగన్… ఈసారి ఏ హీరో కోసం అక్కడికి వెళ్లాడనేది ఇంకా తెలియాల్సి ఉంది.