స్టార్స్ ని ప్యాక్ చేసేస్తున్న భారీ సినిమాలు

Friday,March 15,2019 - 01:13 by Z_CLU

రాజమౌళి ‘RRR’ జూలై 2020 లో రిలీజవుతుంది. అంటే అప్పటి వరకు అటు NTR, ఇటు రామ్ చరణ్ నెక్స్ట్ సినిమాల గాసిప్ కూడా వినిపించదు. ఈ లోపు వీళ్ళిద్దరినీ చూడాలనుకుంటే ఇప్పటికే రిలీజైన సినిమాలు చూసుకోవాలి, వాటితో పాటు అప్పుడప్పుడు రివీల్ అయ్యే RRR సినిమా అప్డేట్స్ తో సరిపెట్టుకోవాలి. మొత్తానికి నెక్స్ట్ ఇయర్ జూలై వరకు రామ్ చరణ్, NTR కంప్లీట్ గా ప్యాక్డ్.

 

తెలుగు సినిమా స్టాండర్డ్స్ తో పాటు బడ్జెట్ కూడా పెరిగిపోయింది. బడ్జెట్ తో పాటు క్వాలిటీ మేకింగ్ ప్రాసెస్ లో టైమ్ కూడా పెరిగిపోయింది. ఇయర్స్ తరబడి సినిమాలు తెరకెక్కించే భారీ బడ్జెట్ సినిమాల ప్రాసెస్ లో ప్యాక్ అయిపోయిన స్టార్స్ జస్ట్ చెర్రీ, NTR మాత్రమే కాదు మరో ఇద్దరు  కూడా ఉన్నారు.

 

సాహో : బాహుబలి’ కోసమని నాలుగేళ్ళు స్పెండ్ చేసేసినా, బాహుబలి 2 రిలీజవ్వగానే హమ్మయ్య ప్రభాస్ ఫ్రీ అయ్యాడు, ఇక బ్యాక్ టు బ్యాక్ సినిమాలే అనుకున్నారంతా. కానీ రివర్సయింది. ప్రభాస్ నెక్స్ట్ సినిమా ‘సాహో’ కి కూడా అదే పరిస్థితి. ఎప్పుడో 2017 ఏప్రిల్ లో రిలీజయింది బాహుబలి 2. ఇప్పటి దాకా ప్రభాస్ నుండి ఇంకో సినిమా రాలేదు.  ఇదంతా ‘సాహో’ వల్లే.

 

సైరా : మెగాస్టార్ కమ్ బ్యాక్ మూవీ ‘ఖైదీ నం 150’ అనగానే, బాస్ ఈజ్ బ్యాక్, ఇక వరసగా సినిమాలు చూసేసుకోవచ్చు అనుకున్నారు మెగా ఫ్యాన్స్. కానీ మెగాస్టార్ కి కూడా గ్యాప్ తప్పలేదు. ‘సైరా’ లాంటి హిస్టారికల్ మూవీకి టైమ్ పట్టడం సహజమే. ఈ సినిమా తరవాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ఎక్స్ పెక్ట్ చేయొచ్చేమో కానీ, ఈ సినిమా రిలీజయ్యే వరకు  మెగాస్టార్ కూడా ‘సైరా’ సరిహద్దులకే పరిమితం.