స్టార్ హీరోనే కాదు.. స్టార్ టెక్నీషియన్లు కూడా..

Wednesday,September 13,2017 - 04:31 by Z_CLU

స్టార్ హీరో మహేష్.. స్టార్ డైరెక్టర్ మురుగదాస్.. స్టార్ హీరోయిన్ రకుల్.. స్పైడర్ సినిమా కోసం తెరపై ఇలా స్టార్స్ లిస్ట్ చాలానే ఉంది. అయితే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే.. ఈ సినిమా కోసం తెరవెనక కూడా స్టార్స్ పనిచేశారు. 24 క్రాఫ్ట్స్ లో స్టార్స్ అనదగ్గ టెక్నీషియన్లు స్పైడర్ కోసం వర్క్ చేశారు. ఆ టెక్నీషియన్లలో కొందరు…

సినిమాటోగ్రాఫర్ :

ఈ సినిమాకు వర్క్ చేసిన స్టార్ టెక్నిషియన్స్ లో ముందుగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్ సంతోష్‌ శివన్‌ గురించే. ఇప్పటికే తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో ఎన్నో భారీ సినిమాలకు పనిచేసిన సంతోష్ శివన్ తన కెమెరా వర్క్ తో ప్రతి సినిమాకు బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చాడు. సంతోష్ శివన్ ఉన్నాడంటే సినిమా విజువల్ ఫీస్ట్ అని అర్థం. ఇక అలాంటి విజువల్స్ లో సూపర్ స్టార్ మహేష్ ఉన్నాడంటే స్క్రీన్ వెలిగిపోవాల్సిందే.

మ్యూజిక్ డైరక్టర్ :

‘స్పైడర్’ కు మరో బిగ్ ఎస్సెట్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ హారీస్ జయరాజ్. ఇచ్చినవి 4 పాటలే కానీ ప్రతిది దేనికదే స్పెషల్ అనేలా బాణీలు కంపోజ్ చేశాడు. ఇక స్పైడర్ థీమ్ సాంగ్ అయితే మూవీకే హైలెట్. వీటితో పాటు రీ-రికార్డింగ్ లో కూడా హరీష్ ఎక్స్ పర్ట్. తన బీజీఎంతో స్పైడర్ ను టెక్నికల్ గా నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాడట హరీష్.

పీటర్ హెయిన్స్ :

ప్రస్తుతం స్టంట్ కొరియోగ్రఫీలో స్టార్ ఎవరంటే పీటర్ హెయిన్స్ పేరు ఫస్ట్ వినిపిస్తుంది. అందుకే ఈ టాప్ ఫైట్ మాస్టర్ ను స్పైడర్ కోసం తీసుకున్నారు. అసలు జేమ్స్ బాండ్ తరహాలో వస్తున్న స్టయిలిష్ యాక్షన్ మూవీ. ఇలాంటి మూవీకు తన యాక్షన్ ఎపిసోడ్స్ తో మరింత స్టయిలిష్ లుక్ తీసుకొచ్చాడు పీటర్ హెయిన్స్. మహేష్ సినిమాతోనే యాక్షన్ కొరియోగ్రాఫర్ అయ్యాడు పీటర్ హెయిన్స్. మురారి సినిమా ఇతడికి ఫస్ట్ మూవీ. అందుకే మహేష్ సినిమా అంటే పీటర్ హెయిన్స్ కు ఎప్పుడూ స్పెషల్ మూవీనే. స్పైడర్ ను కూడా అలానే తీర్చిదిద్దాడు. ఈ సినిమాకు గాను పీటర్ హెయిన్స్ కు నేషనల్ అవార్డు వస్తుందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారంటే, ఇతడి వర్క్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఆర్ట్ డైరక్టర్ :

కంప్లీట్ యాక్షన్ మూవీగా వస్తోంది స్పైడర్ సినిమా. ఇందులో కొన్ని సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ తో పాటు, బాంబ్ బ్లాస్ట్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సన్నివేశాలకు ఆర్ట్ వర్క్ చాలా కీలకం. అందుకే ఏరికోరి మరి మధుసూదన్ ను సెలక్ట్ చేసుకుంది యూనిట్. సినిమాలో కొన్ని బ్లాస్ట్ సీన్స్, బిల్డింగ్ కాలిపోయిన సన్నివేశాలతో మరెన్నో కీలకమైన ఎపిసోడ్స్ తో మధుసూధన్ ఆర్ట్ వర్క్ కనిపిస్తుంది.

శ్రీకర్ ప్రసాద్ :

ఈ పేరు చాలామందికి సుపరిచితం. వందల చిత్రాలకు ఎడిటింగ్ చేసిన ఈ సీనియర్ ఎడిటర్, స్పైడర్ సినిమాకు కూడా ఎడిటర్ గా వర్క్ చేస్తున్నాడు. ప్రేక్షకుడ్ని కుర్చీ అంచున కూర్చోబెట్టగలిగే స్క్రీన్ ప్లేతో వస్తున్న స్పైడర్ సినిమాకు  ఎడిటింగ్ ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ విషయంలో హండ్రెడ్ పర్సెట్ అవుట్ పుట్ ఇచ్చే పనిలో శ్రీకర్ ప్రసాద్ బిజీగా ఉన్నారు.

 

గ్రాఫిక్స్ టీం :

ఇక స్పైడర్ సినిమాలో గ్రాఫిక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బాహుబలి సినిమా తర్వాత మళ్లీ ఆ రేంజ్ లో గ్రాఫిక్ అద్భుతాలు స్పైడర్ లో ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. ఏకంగా 6 దేశాల్లో ఈ సినిమాకు గ్రాఫిక్ వర్క్ నిర్వహించారంటే ఏ రేంజ్ లో విజువల్ ఎఫెక్ట్స్ పై దృష్టి పెట్టారో అర్థం చేసుకోవచ్చు. అలీ, అశ్విన్ లాంటి సీనియర్ కంపోజిటర్స్ ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. స్పైడర్ లో గ్రాఫిక్స్ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయంటోంది యూనిట్.