టాలీవుడ్ మామా మేనల్లుళ్ళు

Tuesday,November 12,2019 - 10:02 by Z_CLU

గల్లా అశోక్… ఇప్పుడు తెలుగు సినిమాకి పరిచయం అవ్వడానికి రెడీగా ఉన్న కొత్త హీరో.. నిజానికి ఓ హీరో డిస్కస్ చేయాలంటే మినిమం ఒక్క సినిమా అయినా రిలీజవ్వాలి… అందునా అది గ్యారంటీగా సక్సెస్ అయి ఉండాలి.. కానీ గల్లా అశోక్ మాత్రం సినిమా లాంచ్ కన్నా ముందే ఆల్మోస్ట్ ఇంట్రడ్యూస్ అయిపోయాడు. దానికి రీజన్… ఈ హీరో మేనమామ… సూపర్ స్టార్ మహేష్ బాబు… అందుకే ఇతగాడిపై ఆ స్థాయిలో ఫోకస్. ఈ సినిమా రిలీజయితే టాలీవుడ్ కి మరో మామా అల్లుళ్ళ జోడీ దొరికినట్టే…

వెంకీ – నాగచైతన్య : ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న మామా అల్లుళ్ళ జోడీ… గతంలో కూడా ‘ప్రేమమ్’ లో కామియో చేశాడు వెంకీ. ఇప్పుడు వెంకీ మామ… ఇప్పటికే రిలీజైన ఈ సినిమా విజువల్స్ వీళ్ళిద్దరి రిలేషన్ షిప్ ని మరింత ఎలివేట్ చేస్తున్నాయి.

 

చిరు, పవన్ సాయి తేజ్, వైష్ణవ్ తేజ్:  మెగా మేనల్లుళ్ళు… ఇంకా వైష్ణవ తేజ్ సినిమా రిలీజ్ కాలేదు కానీ, సాయి తేజ్ కి అటు మెగాస్టార్, ఇటు పవర్ స్టార్ నుండి సపోర్ట్ ఎక్కువే. కుదరాలి కానీ ఈ మేనల్లుడి సినిమా ఈవెంట్స్ కి అటెండ్ అయి ఎంకరేజ్ చేస్తుంటారు స్టార్ మామలిద్దరూ…

నాగార్జున- సుమంత్ & సుశాంత్ : సుమంత్ తో కలిసి ఓ సినిమా కూడా నాగార్జున. ఇక సుశాంత్ రీసెంట్ సినిమా చి.ల.సౌ. సినిమాని కూడా రిలీజ్ చేశాడు. వీళ్ళిద్దరి సినిమాల విషయాల్లో కూడా దగ్గరుండి సజెషన్స్ ఇవ్వడమే కాదు… ప్రమోట్ చేసి సపోర్ట్ కూడా చేస్తుంటాడు ఈ అక్కినేని మామ.