ఫ్యామిలీ హీరోయిన్స్ అనిపించుకుంటున్నారు

Thursday,May 30,2019 - 10:02 by Z_CLU

ఒక్క మెగా హీరో సరసన చాన్స్ దొరికిందంటే అనుమానం లేదు ఏ హీరోయిన్ కైనా వరసగా ఇంకో మెగా హీరో సరసన అవకాశం వచ్చేస్తుంది. అయితే ఈ రూల్ జస్ట్ మెగా ఫ్యామిలీకే ఫిక్సవ్వలేదు. ఇతర హీరోల విషయంలో కూడా జరుగుతుంది.

రకుల్ ప్రీత్ సింగ్ : కార్తీ సరసన ‘దేవ్’ సినిమాలో నటించింది రకుల్ ప్రీత్ సింగ్. వీళ్ళిద్దరి ఆన్ స్క్రీన్ జోడీకి మంచి గుర్తింపు కూడా వచ్చింది. అయితే ఆ సినిమా తరవాత ఇమ్మీడియట్ గా సూర్య ‘NGK’ లోను చాన్స్ కొట్టేసింది. ఇంతేనా… అక్కినేని వారి విషయంలో కూడా అదే జరిగింది. నాగ చైతన్యతో ‘రారండోయ్ వేడుక చూద్దాం’ లో నటించిందా..? ఇప్పుడు ‘మన్మధుడు 2’ తో నాగ్ హీరోయిన్ అనిపించుకోనుంది.

నిధి అగర్వాల్ –  నాగ చైతన్య ‘సవ్యసాచి’ సినిమాతో లాంచ్ అయింది. నిధికి అదృష్టం ఎంతగా కలిసొచ్చిందంటే ఈ సినిమా రిలీజ్ కూడా ఆవ్వకముందే అఖిల్ ‘మజ్ను’ సినిమాలో  అవకాశం దక్కింది. 2 సినిమాల్లోనూ యూత్ ఫుల్ క్యారెక్టరే కాబట్టి, ఈజీగా హ్యాండిల్ చేసిందనిపించింది.

 కాజల్ అగర్వాల్ : NTR, కాజల్ అగర్వాల్ కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ మూవీ ‘బృందావనం’. ఈ సినిమా తరవాత బాద్షా, టెంపర్ సినిమాల్లోనూ చాన్స్ కొట్టేసింది కాజల్ అగర్వాల్. ఈ వరసలో కళ్యాణ్ రామ్ ‘MLA’ లోను నటించి నందమూరి ఫ్యామిలీ హీరోయిన్ అనిపించుకుంది.

నయనతార : వెంకీ సరసన నటించిన కొంతమంది హీరోయిన్స్ కి ఆడియెన్స్ లో స్పెషల్ ప్లేస్ ఉంటుంది. వాటిలో నయనతార కూడా ఉంది. వెంకీ తో ‘లక్ష్మి’ సినిమాతో ఫస్ట్ టైమ్ జోడీ కట్టింది. ఆ తరవాత తులసి, బాబు బంగారం సినిమాల్లోనూ నటించేసింది. ఇక ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమాలో రానా సరసన కూడా నటించి అంతే ఇంప్రెస్ చేసింది. ఇలా కొంతమంది భామలు ఫ్యామిలీ హీరోయిన్స్ అనిపించుకుంటున్నారు.