నభా నతేష్ కి స్టార్ హీరోయిన్ స్టేటస్..?

Friday,June 21,2019 - 01:06 by Z_CLU

‘నన్ను దోచుకుందువటే’ లో కొత్త అమ్మాయే అయినా మంచి పర్ఫామర్ అనిపించుకుంది. సుధీర్ బాబు సరసన కాస్తంత హైపర్ ఫ్లేవర్ ఉన్న క్యారెక్టర్ లో నటించి మంచి అప్లాజ్ అందుకుంది. దానికి రిజల్టే ‘ఇస్మార్ట్ శంకర్’. రెండో సినిమాకే మాసివ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో రామ్ సరసన అవకాశం దక్కించుకుంది. అయితే జస్ట్ 2 సినిమాలకే ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకోనుందా..? అవుననే అనిపిస్తుంది.

‘ఇస్మార్ట్ శంకర్’ లో నభా కి ఏ స్థాయిలో పర్ఫామెన్స్ కి స్కోప్ ఉన్న రోల్ దొరికిందనేది ఇపుడప్పుడే చెప్పడం కుదరదు కానీ, ప్రమోషన్ లో భాగంగా ఈ సినిమా నుండి ఏ చిన్న విజువల్ బయటికి వచ్చినా, రామ్ తరవాత ఇమ్మీడియట్ గా ఫోకస్ లోకే వచ్చేసి మాత్రం నభానే. అంతగా నభా చుట్టూరా ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది.

ఫస్ట్ సినిమా పర్ఫామెన్స్ ని ఎలివేట్ చేస్తే ‘ఇస్మార్ట్ శంకర్’ నభా నతేష్ ని మాస్ ఆడియెన్స్ కి మరింత దగ్గర చేయబోతుంది. చాలా సెలెక్టివ్ గా సినిమాలను ఎంచుకుంటున్న నభాకి ‘ఇస్మార్ట్ శంకర్’ లో అవకాశం అదృష్టంగా కలిసొస్తే, అదిరిపోయే గ్లామర్… దానికి తగ్గ ఆటిట్యూడ్ సోషల్ మీడియాలో ఫైర్ జెనెరేట్ చేస్తుంది.

నభా నతేష్ కి గతంలో ఎన్నడూ లేనంత క్రేజ్ క్రియేట్ అవ్వడం చూస్తుంటే, ‘ఇస్మార్ట్ శంకర్’ రిలీజ్ తరవాత రేంజ్ మారిపోయే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.  ఇప్పటికే వైరల్ అవుతున్న విజువల్స్ నభా నతేష్ గ్లామరస్ పర్ఫామెన్స్ విషయంలో భారీ అంచనాలు క్రియేట్ చేస్తున్నాయి. ఆ అంచనాలకు సరితూగగలిగితే చాలు.. నభా నతేష్ కి స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కినట్టే.. అనుమానం లేదు.