రెండేసి సినిమాలతో స్టార్ హీరోలు

Thursday,June 15,2017 - 07:30 by Z_CLU

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వాటి హాట్ హాట్ అప్ డేట్స్ తో బిజీ బిజీగా ఉంది టాలీవుడ్. నార్మల్ గా ఒక సినిమా కంప్లీట్ అయిన తరవాత ఇంకో సినిమా ప్లాన్ చేసుకునే స్టార్స్, ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాకి గ్రీన్ ఇచ్చేస్తున్నారు. కొందరు స్టార్స్ ఒకేసారి రెండు సినిమాలకు పనిచేస్తుంటే, మరికొందరు బ్రేక్ దొరికినప్పుడల్లా నెక్స్ట్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నారు.

 

NTR: బాబీ డైరెక్షన్ లో జై లవకుశ సినిమాతో బిజీ బిజీగా ఉన్నాడు యంగ్ టైగర్. పక్కా ప్లానింగ్ తో ఫాస్ట్ పేజ్ లో ఈ సినిమాకి ప్యాకప్ చెప్తాడో లేదో, ఇమ్మీడియట్ గా తివిక్రమ్ సినిమాతో సెట్స్ పైకి వచ్చేస్తాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు ఎక్కడి వరకు వచ్చాయో ఇన్ఫర్మేషన్ లేదు కానీ, ఈ యూనిక్ కాంబోపై అప్పుడే ఇంటరెస్టింగ్ బజ్ బిగిన్ అయింది. ఈ సినిమాతో పాటు కొరటాల శివతో కూడా సినిమా ప్లాన్ చేస్తున్నాడు NTR.

రవితేజ : బెంగాల్ టైగర్ తరవాత బ్రేక్ తీసుకున్న మాస్ మహారాజ్ రవితేజ, ఒకేసారి రెండేసి సినిమాలు అనౌన్స్ చేసి సర్ ప్రైజ్ చేశాడు. ఓ వైపు విక్రమ్ సిరికొండ డైరెక్షన్ లో ‘టచ్ చేసి చూడు’ చేస్తూనే, మరో వైపు ‘రాజా ది గ్రేట్’ సినిమాను కంప్లీట్ చేసే ప్రాసెస్ లో ఉన్నాడు రవితేజ.

 మహేష్ బాబు : మహేష్ బాబు కరియర్ లోనే మోస్ట్ అవేటింగ్ టెక్నికల్ అడ్వెంచరస్ ఎంటర్ టైనర్ ‘స్పైడర్’, రీసెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. ఈ సినిమా షూటింగ్ స్టేజ్ లో ఉండగానే కొరటాల శివకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సూపర్ స్టార్.. స్పైడర్ రిలీజ్ కంటే ముందే ‘భరత్ అనే నేను’ సినిమా సెట్స్ పైకి వచ్చేస్తున్నాడు.

 అల్లు అర్జున్ : అల్లు అర్జున్ DJ ఈ నెల 23 న రిలీజ్ కి రెడీగా ఉంది. ఇప్పటికే టాలీవుడ్ లో హై ఎండ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ కి జస్ట్ రీసెంట్ గా ప్యాకప్ చెప్పాడు బన్ని. కానీ అంతలోనే వక్కంతం వంశీతో ‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’ సినిమా స్టార్ట్ చేశాడు.

రామ్ చరణ్ : ప్రస్తుతం ‘రంగస్థలం’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న చెర్రీ, ఈ సినిమా తరవాత ఇమ్మీడియట్ గా మణిరత్నంతో సినిమా చేసే ఛాన్స్ ఉంది.

 ప్రభాస్ : బాహుబలి కోసం ఐదేళ్ళు డెడికేట్ చేసిన రెబల్ స్టార్, ఇయర్ కి 2 సినిమాలు గ్యారంటీ అని ప్రామిస్ చేశాడు. మాట ఇచ్చినట్టుగానే బ్యాక్ టు బ్యాక్  సినిమాలను లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం సుజిత్ ‘సాహో’ సినిమాకు రెడీ అవుతున్న ప్రభాస్, ఈ సినిమా తరవాత ఇమ్మీడియట్ గా రాధాకృష్ణ డైరెక్షన్ లో గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ పై సినిమా చేస్తాడు.

 చిరంజీవి : ప్రస్తుతం ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి మేకోవర్ లో బిజీగా ఉన్న మెగాస్టార్ కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ప్లాన్ చేశారు. ఉయ్యాలవాడ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉండగానే బోయపాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మాతగా తెరకెక్కనుంది ఈ సినిమా.

 బాలకృష్ణ : గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి హిస్టారికల్ బ్లాక్ బస్టర్ తర్వాత పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో మాస్ మసాలా ఎంటర్ టైనర్ ‘పైసా వసూల్’ తో బిజీ అయిపోయిన బాలయ్య, ఈ సినిమా సెట్స్ పై నుండి పక్కకు   రాగానే K.S. రవికుమార్ తో సెట్స్ పై ఉంటాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ ఆల్రెడీ బిగిన్ అయింది.