బన్ని డైలాగ్ వీళ్ళకు కూడా సూటవుతుంది

Saturday,August 17,2019 - 12:02 by Z_CLU

రీసెంట్ గా రిలీజైన ‘అల.. వైకుంఠపురం’ ఇంట్రడక్షన్ టీజర్ లో బన్ని లుక్స్ కొత్తగా అనిపించాయి. దాంతో పాటు ‘ఏంటిరో.. గ్యాప్ ఇచ్చావ్…’ అని మురళీశర్మ డైలాగ్ కి రిప్లైగా ‘ఇవ్వలే… వచ్చింది అంటాడు బన్ని… నిజానికి ఇది సినిమాలో డైలాగే అయినా, బన్ని సినిమాల విషయంలో కూడా వర్తిస్తుంది. ‘నా పేరు సూర్య’ తరవాత బన్ని ఇమ్మీడియట్ గా సెట్స్ పైకి రాలేదు. దాంతో ఫ్యాన్స్ కి చెప్పీ చెప్పకుండానే ఎక్స్ ప్లెనేషన్ ఇచ్చేశాడు. ఈ లెక్కన ఈ డైలాగ్ మరికొంతమంది స్టార్ హీరోస్ కూడా సూటవుతుంది.  

ప్రభాస్ : ‘బాహుబలి – కంక్లూజన్’ రిలీజ్ కి ‘సాహో’ రిలీజ్ కి ఏకంగా రెండేళ్ళ గ్యాప్ వచ్చింది. అయితే నిజానికి ఈ గ్యాప్ ప్రభాస్ ప్లాన్ చేసింది కాదు. ‘బాహుబలి’ తరవాత ప్రభాస్ పెద్దగా బ్రేక్ కూడా తీసుకోలేదు. ‘సాహో’ మేకింగ్ కి టైమ్ పట్టిందంతే. బన్ని చెప్పినట్టు ఈ గ్యాప్ ఇచ్చింది కాదు వచ్చింది’ అంతే.

రామ్ చరణ్ : ‘వినయ విధేయ రామ’ తరవాత ఇంకేదైనా సినిమా ప్లాన్ చేసుకుని ఉంటే మినిమం 1 ఇయర్ గ్యాప్ లో మళ్ళీ థియేటర్స్ లో రెడీగా ఉండేవాడు చెర్రీ… కానీ ‘రాజమౌళి’ సినిమా. గ్యాప్ గ్యారంటే అని ఫిక్సయ్యే సినిమాకి కమిట్ అయ్యాడు చెర్రీ. ఇక్కడ కూడా అంతే రామ్ చరణ్ ‘గ్యాప్ ఇవ్వలేదు.. వచ్చింది’ అంతే…

NTR: చెర్రీ ఫార్ములానే NTR కి కూడా వర్తిస్తుంది. ఈ యంగ్ టైగర్ లాస్ట్ రిలీజ్ ‘అరవింద సమేత’ కి, ‘RRR’ ఏకంగా రెండేళ్ళు… ‘గ్యాప్ ఇవ్వలేదు.. వచ్చింది’ అన్నమాట.

చిరంజీవి : ‘ఖైదీ నం 150’ తరవాత చిరు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చూసేయొచ్చు అనుకున్నారంతా… కానీ మెగాస్టార్ మైండ్ లో ‘సైరా’ లాంటి మ్యగ్నమ్ ఓపస్ నడిచింది. అందుకే ఈ గ్యాప్… అది కూడా కావాలని ఇచ్చింది కాదు.. జస్ట్ అలా వచ్చింది అంతే.