అంతకు మించి అంటున్న హీరోలు...

Friday,June 28,2019 - 11:02 by Z_CLU

ఓ హీరో సినిమా కంప్లీట్ అయిందంటే ఆ హీరో నెక్స్ట్ సినిమా ఏమై ఉంటుందనే క్యూరియాసిటీ బిగిన్ అయిపోతుంది ఫ్యాన్స్ లో. అందుకే హీరోలు ఓ సినిమా సెట్స్ పై ఉండగానే వరసగా బ్యాక్ టు బ్యాక్  లైనప్ చేసుకున్న సినిమాలను అనౌన్స్ చేసేస్తున్నారు.

 

నితిన్ : ‘శ్రీనివాస కళ్యాణం’ తరవాత నితిన్ చేయబోయే సినిమా ఎలా ఉండబోతుందా..? అని ఫ్యాన్స్ ఎదుఉర్ చూస్తున్న టైమ్ లో అనౌన్స్ చేశాడు నితిన్ 3 సినిమాలు. ప్రస్తుతం ‘భీష్మ’ సెట్స్ పై ఉన్నాడు… ఆ తరవాత వరసగా వెంకీ అట్లూరి తో ‘రంగ్ దే’, చంద్రశేఖర్ యేలేటి తో మరో సినిమా చేస్తాడు. ఈ 2 సినిమాలు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్నాయి.

 

అల్లు అర్జున్ : ఇప్పుడు త్రివిక్రమ్ తో చేస్తున్నాడు. ఈ సినిమా తరవాత ఏంటి..? అని కనీసం ఫ్యాన్స్ లో ఆలోచన కూడా రాకముందే సుకుమార్, దర్శకుడు శ్రీరామ్ తో ‘ఐకాన్’ అనౌన్స్ చేశాడు.

చిరంజీవి సైరా’ వల్ల ఓ రకంగా చెప్పాలంటే 150 తర్వాత చాలా గ్యాప్ వచ్చేసింది. అఫ్ కోర్స్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా స్టాండర్డ్స్ కూడా వేరు… అందుకే ఫ్యాన్స్ క్యూరియాసిటీని మైండ్ లో పెట్టుకునే ఇమ్మీడియట్ గా కొరటాల తో సినిమా అనౌన్స్ చేసిన మెగాస్టార్, కొన్నాళ్ళకు త్రివిక్రమ్ తో సినిమా కన్ఫమ్ చేశాడు.

వెంకటేష్ : ప్రస్తుతం ‘వెంకీమామ’ సినిమాతో బిజీగా ఉన్నాడు వెంకీ. ఈ సినిమా తరవాత త్రినాథ రావు నక్కిన తో సెట్స్ పై ఉంటాడు. ఈ సినిమాతో పాటు తరుణ్ భాస్కర్ తో కూడా సినిమా ఉంటుందని అనౌన్స్ చేశారు. మరోవైపు బాలీవుడ్ సినిమా ‘దే దే ప్యార్ దే’ సినిమా రీమేక్ పనులు కూడా స్టార్ట్ అయిపోయాయి. వీటి మధ్య అనిల్ రావిపూడి, త్రివిక్రమ్ కూడా కథ చెప్పి ఉన్నారు కాబట్టి… విక్టరీ వెంకటేష్ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చూసి ఎంజాయ్ చేయొచ్చని ఫీలవుతున్నారు ఫ్యాన్స్.