టాలీవుడ్ పోలీసులు

Thursday,May 09,2019 - 03:02 by Z_CLU

సినిమాలో హీరో క్యారెక్టర్ పోలీస్ అయితే అనుమానం లేదు అవుట్ అండ్ అవుట్ పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనరే. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో వరసగా పోలీస్ బ్యాక్ డ్రాప్ సినిమాలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఒకరు ఇద్దరు కాదు ఏకంగా నలుగు హీరోలు పోలీస్ ఆఫీసర్స్ గా మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.

వెంకటేష్ : ఇంకా అఫీషియల్ గా కన్ఫమ్ కాలేదు కానీ ఆల్మోస్ట్ వెంకటేష్ నెక్స్ట్ సినిమా పోలీస్ బ్యాక్ డ్రాప్ లో అనే తెలుస్తుంది. వెంకీ మార్క్ తో అటు సెంటిమెంట్, మాస్, యాక్షన్ ప్యాకేజ్ లా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో వెంకీ మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా మెస్మరైజ్ చేయబోతున్నాడు.

రానా – ‘విరాట పర్వం’ సినిమాలో రానా కనిపించబోయేది పోలీసాఫీసర్ గానే. 1990 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా డిఫెరెంట్ ఎక్స్ పీరియన్స్ ని ఇవ్వబోతుంది. రానా తెలుగులో ఇలాంటి రోల్ ప్లే చేయడం ఫస్ట్ టైమ్.

రాజశేఖర్ –  మర్డర్ మిస్టరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ‘కల్కి’ లో రాజశేఖర్ నటించేది కూడా పోలీసాఫీసర్ పాత్రే. అగ్రెసివ్ థ్రిల్లర్ లా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజశేఖర్ పవర్ ఫుల్ ఆఫీసర్ గా చూడబోతున్నాం.

బాలకృష్ణ : బాలయ్య 105 వ సినిమాలో ఆల్మోస్ట్ పోలీసాఫీసర్ పాత్రే అని తెలుస్తుంది.  ఈ విషయం ఇంకా అఫీషియల్ గా కన్ఫమ్ కాలేదు కానీ, ఈ సినిమా చుట్టూ క్రియేట్ అయిన బజ్ ని బట్టి ఈ సారి దర్శకుడు K.S. రవి కుమార్ బాలయ్య కోసం పవర్ ఫుల్ మాసివ్ పోలీసాఫీసర్ పాత్ర రాసుకున్నాడని తెలుస్తుంది.