రిపీట్ ఇట్ అంటున్న స్టార్ హీరోలు

Saturday,June 01,2019 - 10:02 by Z_CLU

సినిమా సక్సెస్ కి మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా మ్యాటరే. ఓ రకంగా చెప్పాలంటే సినిమా రిలీజ్ కి ముందే సినిమాని వైడ్ రేంజ్ లో రీచ్ అయ్యేలా చేసేవే సాంగ్స్.. ఆ తరవాత సినిమాలోని సిచ్యువేషన్స్ కి తగ్గట్టు మ్యూజిక్ కంపోజర్స్ సింక్ చేసే BGM సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్. అందుకే మ్యూజిక్ కంపోజర్స్ విషయంలో అస్సలు చాన్స్ తీసుకోవడం లేదు స్టార్ హీరోలు… ఓ సినిమా సక్సెస్ అయిందంటే తరవాత సినిమాకి కూడా ఆ మ్యూజిక్ డైరెక్టర్ నే ప్రిఫర్ చేస్తున్నారు.

మహేష్ బాబు దేవి శ్రీ ప్రసాద్ :  భరత్ అనే నేను… మహర్షి.. ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు…’ వరసగా మహేష్ బాబు 3 సినిమాలకు DSP నే మ్యూజిక్ కంపోజర్. ఈ సినిమాకి కూడా DSP రాకింగ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తాడని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు సూపర్ స్టార్.

నాని – అనిరుద్ : నాని ‘జెర్సీ’ కి మ్యూజిక్ కంపోజ్ చేశాడు అనిరుద్. ఈ సినిమా సాంగ్స్ కి నాని ఎంత ఇంప్రెస్ అయ్యాడంటే సినిమా సాంగ్స్ కూడా రిలీజ్ కి కాకముందే, నెక్స్ట్ సినిమా ‘గ్యాంగ్ లీడర్’ కి కూడా అనిరుద్ నే ఫిక్స్ చేసుకున్నాడు. ఆల్రెడీ ఈ సినిమా కంపోజ్ చేయడం కూడా కంప్లీట్ చేసేశాడు ఈ యంగ్ మ్యూజిక్ కంపోజర్.

రవితేజ తమన్ : రీసెంట్ గా రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోని’ కి మ్యూజిక్ కంపోజ్ చేశాడు తమన్. ఇప్పుడు సెట్స్ పై ఉన్న ‘డిస్కోరాజా’ కి కూడా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.