మే నెలను మిస్ అయిన స్టార్ హీరోలు

Wednesday,April 26,2017 - 06:35 by Z_CLU

ప్రతీ నెల ఓ స్టార్ హీరో థియేటర్ లో సందడి చేయడం కామన్. సంక్రాంతి, సమ్మర్ లాంటి సీజన్స్ అయితే హీరోల మధ్య పోటీ కూడా అంతే కామన్. కానీ ఆశ్చర్యంగా ఈసారి మాత్రం కీలకమైన సమ్మర్ సీజన్ ను మన స్టార్ హీరోలంతా మూకుమ్మడిగా మిస్ అయ్యారు. మరీ ముఖ్యంగా మే నెలలో స్టార్ ఎట్రాక్షన్ అనేదే కనిపించకుండా పోయింది.

మహేష్, పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్.. ఇలా స్టార్ హీరోలు చాలామంది మే నెలను మిస్ అయ్యారు. అటు సీనియర్లలో చూసుకుంటే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ సినిమాలు కూడా మే నెలలో లేవు. వీళ్లతో పాటు గోపీచంద్, రవితేజ, సాయిధరమ్ తేజ, వరుణ్ తేజ సినిమాలు కూడా వచ్చే నెలలో లేవు.

నిజానికి మే నెలలో బన్నీ సందడి చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ డీజే మూవీ  పోస్ట్ పోన్ అయింది. ఇలా చాలా పెద్ద సినిమాలు మే నెల నుంచి తప్పుకోవడంతో ఒక్కసారిగా బాక్సాఫీస్ ఖాళీ అయిపోతుంది. ఈ వీకెండ్ విడుదల అవుతున్న బాహుబలి-2 మాత్రమే మే మంత్ ను కూడా కవర్ చేయబోతోంది.

బాహుబలి-2 తర్వాత చెప్పుకోదగ్గ పెద్ద రిలీజెస్ లో నాగచైతన్య, నిఖిల్, రాజ్ తరుణ్ సినిమాలు మాత్రమే ఉన్నాయి. చైతూ నటిస్తున్న రారండోయ్  వేడుక చూద్దాం, నిఖిల్ నటిస్తున్న కేశవ  సినిమాలు మే 19న విడుదలకానున్నాయి. ఇక రాజ్ తరుణ్ నటిస్తున్న అంధగాడు సినిమాను మే 26న విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతానికి మే నెలలో స్టార్ ఎట్రాక్షన్ ఉన్న సినిమాలివే.