కొంపముంచుతున్న యాక్సిడెంట్లు

Thursday,June 20,2019 - 12:01 by Z_CLU

హీరోలు సినిమాల్లో రియాలిటీకి దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు.  దాని వల్ల గాయాపాలవుతున్నారు. ఈ మధ్య జరిగిన ఇలాంటి యాక్సిడెంట్స్ వల్ల కొంతమంది హీరోలు గాయపడ్డారు. దీంతో వాళ్ళ సినిమాలపై మాత్రం భారీ ఇంపాక్ట్ పడింది. ఈ స్టార్ హీరోస్ కోలుకోవడానికి ఎలాగూ టైమ్ పడుతుంది కాబట్టి న్యాచురల్ గానే షూటింగ్ ఆగిపోతుంది.

నాగశౌర్య : రమణ తేజ డైరెక్షన్ లో నటిస్తున్నాడు నాగశౌర్య. ఈ సినిమాలోని ఒక సన్నివేశంలో గోడ దూకాల్సి వచ్చింది. తగిన ప్రాక్టీస్ చేసినా సమయానికి మిస్ కమ్యూనికేషన్ వల్ల గాయలపాలయ్యాడు. ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. నాగశౌర్య కోలుకునే వరకు ఈ సినిమా షూటింగ్ కి సెలవులు ప్రకటించినట్టే…

సందీప్ కిషన్ : ‘తెనాలి రామకృష్ణ’ సినిమా షూటింగ్ లో గాయపడ్డాడు. ఆ సినిమా షూటింగ్ ఆగిపోయింది. అయితే ఈ ఎఫెక్ట్ జస్ట్ ఈ ఒక్క సినిమాపైనే పడలేదు. ‘నిను వీడని నీడను నేనే’ అనే మరో సినిమా ప్రచారంపై  కూడా పడింది.

శర్వానంద్: బ్యాంకాక్ లో జరిగిందీ యాక్సిడెంట్. సినిమాలోని ఒక సన్నివేశం కోసం పారా గ్లైడింగ్ ప్రాక్టీస్ చేసే సమయంలో గాయపడ్డాడు. దీంతో 96 సినిమా షూటింగ్ ఆగిపోయింది. దీని ఎఫెక్ట్  ‘రణరంగం’ పై కూడా పడింది. 2 నెలల పాటు శర్వానంద్ ఇంటికే పరిమితం.