స్టార్ హీరోల మెటీరియల్ కాదా...?

Friday,March 08,2019 - 10:06 by Z_CLU

‘జెంటిల్ మెన్’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. తెలుగులో ఫస్ట్ సినిమానే కానీ, అప్పటికే చేసిన తమిళ, మళయాళ సినిమాలను లెక్కలోకి తీసుకుంటే ‘జెంటిల్ మెన్’ నివేతకి 10 వ సినిమా. అందుకే ఆ ఆనుభవం నివేత పర్ఫామెన్స్ లో క్లియర్ గా కనిపించింది. ఇక్కడ జస్ట్ ఒక్క సినిమాకే ఇంటెలిజెంట్ హీరోయిన్ అనిపించుకుంది. అయితే ఆ ఇంటెలిజెన్సీ ఏ మాత్రం ఇంప్రెస్ చేయగలిగింది.

నాని ఇమ్మీడియట్ గా నెక్స్ట్ సినిమా ‘నిన్నుకోరి’ కి కూడా నివేతనే ప్రిఫర్ చేశాడు… సంతోషమే. ఆ తరవాత NTR ‘జై లవకుశ’ లోను చాన్స్ కొట్టేసింది నివేత. కానీ ఆ తరవాతే నివేత పేరు కూడా పెద్దగా వినిపించడం లేదు. NTR లాంటి స్టార్ సరసన నటించాక కూడా నివేత ఇంతగా వెనకపడిపోవడం కొంచెం ఆలోచించాల్సిన విషయమే.

స్టార్స్ ప్రిఫర్ చేయట్లేదా..? లేకపోతే నివేత తనను ప్రమోట్ చేసుకోవడంలో ఫెయిలవుతుందా…? లాంటివి పక్కన పెడితే, ఎంత ఇంటెలిజెంట్ పర్ఫామర్ అయినా, గ్లామర్ కాంపిటీషన్ లో 100% వెనకబడిందనే చెప్పాలి. అందుకే స్టార్ హీరోలను అంతగా ఇంప్రెస్ చేయలేకపోతుంది.

రీసెంట్ గా కళ్యాణ్ రామ్ సరసన ‘118’ లో కూడా ఇంప్రెసివ్ గా పర్ఫామ్ చేసింది నివేత. అసలు కథ మొత్తం నివేత క్యారెక్టర్ చుట్టే తిరగడంతో మరోసారి ఆడియెన్స్ దృష్టిలో పడింది. అయితే ఈ సినిమా నివేతని ఏ స్థాయిలో ప్రమోట్ చేస్తుందీ..? ఇకనుండైనా స్టార్ హీరోస్ నివేతను కన్సిడర్ చేస్తారా, లేదా చూడాలి.