2021 స్టార్ హీరోలొస్తున్నారు

Tuesday,February 02,2021 - 04:39 by Z_CLU

గతేడాది సూపర్ స్టార్ మహేష్ బాబు , స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలు తప్ప మిగతా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవ్వలేదు. షూటింగ్ స్టేజిలో ఉన్న స్టార్ హీరోల సినిమాలన్నీ లాక్ డౌన్ వల్ల ఆలస్యం అవ్వడం,  రిలీజ్ లు వాయిదా పడటంతో  గతేడాది ఫ్యాన్స్ కి నిరాశే మిగిలింది. తమ సినిమాల కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానుల కోసం ఈ ఏడాది భారీ సినిమాలతో రాబోతున్నారు స్టార్ హీరోలు. అవేంటో ఓ లుక్కేద్దాం.

ACHARYA

మెగా స్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహ రెడ్డి’ వచ్చి రెండేళ్లవుంది. ఈ గ్యాప్ ను ‘ఆచార్య’ తో మరిచిపోయేలా చేసేందుకు రెడీ అయ్యాడు చిరు. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ తో కలిసి మెగా అభిమానులకు విందు భోజనం అందించబోతున్నారు చిరంజీవి.  ఆచార్య మే 13 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

గతేడాది కరోనా కారణంగా ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేకపోయిన నందమూరి నటసింహం బాలకృష్ణ ఈ ఏడాది బోయపాటి శ్రీను డైరెక్షన్ లో చేస్తున్న ‘BB3’ తో మాస్ ఆడియన్స్ మెప్పించడానికి రెడీ అవుతున్నాడు. ప్రెజెంట్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సమ్మర్ లో మే 28న విడుదల కానుంది.

తీసుకున్న గ్యాప్ ను భర్తీ చేసేలా ఈ ఇయర్ రెండు సినిమాలతో ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేసి మెప్పించడానికి  రెడీ అవుతున్నాడు విక్టరీ వెంకటేష్.  ఈ ఏడాది వెంకీ నుండి రెండు సినిమాలు రాబోతున్నాయి. అందులో ఒకటి శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో నటిస్తున్న ‘నారప్ప’ కాగా మరొకటి అనిల్ రావిపూడి తో చేస్తున్న ‘F3’.

మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఈ ఏడాది రెండు సినిమాలతో ఫ్యాన్స్ ని ఖుషీ చేయాలని ఫిక్సయ్యాడు పవన్ కళ్యాణ్. ఏప్రిల్ 9న ‘వకీల్ సాబ్’ గా థియేటర్స్ ఎంట్రీ ఇవ్వనున్న పవర్ స్టార్ ఏడాది చివర్లో రానాతో కలిసి చేస్తున్న సినిమాతో ఎండ్ ఇవ్వనున్నాడు. అంటే ఈ ఏడాది తన గ్యాప్ ని రెండు సినిమాలతో భర్తీ చేసి ఫ్యాన్స్ లో మళ్ళీ మునుపటి జోష్ తీసుకురానున్నాడు పవన్.

ఈ ఏడాది అక్టోబర్ తో ఎన్టీఆర్ సినిమా రిలీజై మూడేళ్ళవుతుంది. సరిగ్గా మళ్ళీ అదే నెలలో రాజమౌళి తో చేస్తున్న ‘RRR’ తో అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించాలని డిసైడ్ అయ్యాడు తారక్. ఇప్పటికే టీజర్ తో కొమురం భీమ్ గా ఫ్యాన్స్ లో మరింత క్యూరియాసిటీ పెంచేశాడు. ఇక ఇదే సినిమాతో రామ్ చరణ్ కూడా తన అభిమానులకు ట్రీట్ ఇవ్వనున్నాడు. ‘రంగస్థలం’ తర్వాత ఈ సినిమా కోసమే గ్యాప్ తీసుకున్న చరణ్ అల్లూరి సీతారామరాజు గా కనిపించి ఆకట్టుకోవడానికి సిద్దమవుతున్నాడు.

ఇక కన్నడ స్టార్ యష్ కూడా తన పాన్ ఇండియా సినిమా ‘KGF 2’ ఈ ఏడాదే రానున్నాడు. ఈ సినిమా కోసం అన్ని భాషల ప్రేక్షకులు ఎంతో ఎగ్జైట్ మెంట్ తో వెయిట్ చేస్తున్నారు. ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టేజిలో ఉన్న ఈ సినిమా జులై 16 న భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది.

గతేడాది ఆరంభంలో ‘అల వైకుంఠపురములో’ తో వచ్చి ఇండస్ట్రీ హిట్ అందుకున్న అల్లు అర్జున్ ఈ ఏడాది ‘పుష్ప’ సినిమాతో ఫ్యాన్స్ ని కొత్తగా ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే బన్నీ లుక్స్ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పుతున్నాయి.  ఆగస్ట్ 13 న పుష్ప రాజ్ గా ఆడియన్స్ ముందుకు రానున్నాడు బన్నీ.

ఈ ఏడాది సంక్రాంతికి ‘క్రాక్’ తో బ్లాక్ బస్టర్ కొట్టిన మాస్ మహారాజా రవితేజ కూడా ‘ఖిలాడీ’ సినిమాతో మే 28 న మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఇలా టాప్ స్టార్ హీరోల సినిమాలతో పాటు గోపీచంద్ , రానా, నితిన్, నాని, శర్వానంద్ , వరుణ్ తేజ్, నాగ చైతన్య , సాయి ధరం తేజ్, నాగ శౌర్య , అఖిల్, అడివి శేష్, శ్రీ విష్ణు, సందీప్ కిషన్ సినిమాలు కూడా రిలీజవుతూ థియేటర్స్ కి జనాలను రప్పించనున్నాయి. వీటితో పాటు కార్తి , విశాల్ వంటి కోలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు కూడా డబ్బింగ్ చేసుకొని తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఏదేమైనా బడా సినిమాలతో గ్యాప్ లో మినిమం రేంజ్ సినిమాలతో ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడనుండి.