బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో స్టార్ హీరో

Thursday,August 24,2017 - 12:39 by Z_CLU

జయ జానకి నాయక తరవాత ఏ మాత్రం గ్యాప్ లేకుండా శ్రీవాస్ సినిమాతో బిజీ అయిపోయాడు బెల్లంకొండ శ్రీనివాస్. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోలాచిలో వేసిన భారీ సెట్ లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ కీ రోల్ ప్లే చేయడం కోసం స్టార్ హీరోని సంప్రదిస్తున్నారనే న్యూస్ టాలీవుడ్ లో చిన్న సైజు వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది.

స్టార్ హీరో అనగానే కాస్త కాన్సంట్రేట్ ఈ సినిమా వైపు మళ్ళినా, సినిమా యూనిట్ నుండి ఇప్పటి వరకు ఎటువంటి అప్ డేట్ అయితే బయటికి రాలేదు. ఇకపోతే జగపతి బాబు, మీనా స్పెషల్ రోల్స్ చేస్తున్న ఈ సినిమా అల్టిమేట్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది. ఇక ఆ పర్టికులర్ స్టార్ హీరో ఎవరో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.