టాలీవుడ్ లో తమ్ముళ్ళు

Saturday,May 18,2019 - 10:02 by Z_CLU

ఓ హీరో తెలుగు సినిమాకి ఇంట్రడ్యూస్ అయ్యాడంటే పెద్దగా ఎక్స్ పెక్టేషన్స్ ఉండవు. సినిమా బావుంటే ఆడుతుంది.. లేకపోతే లేదు. కానీ ఓ స్టార్ హీరో తమ్ముడు హీరోగా ఎంట్రీ ఇస్తే… ఈసారి రిసీవ్ చేసుకునే విధానం మారుతుంది. డెఫ్ఫినెట్ గా స్టార్ అన్నయ్య ఇంపాక్ట్ తమ్ముడి సినిమాపై కూడా కచ్చితంగా పడుతుంది. అంత ప్రెజర్ లోను ఇంప్రెసివ్ కంటెంట్ తో సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు తముళ్ళు…

ఆనంద్ దేవరకొండ – దొరసాని : విజయ్ దేవరకొండ తమ్ముడు తన మొదటి సినిమాతో రెడీ అవుతున్నాడు. టైటిల్ ని బట్టి సినిమా కూడా డిఫెరెంట్ గా ఉండే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కాకపోతే విజయ్ దేవరకొండ స్థాయి క్రేజ్ ని ఆనంద్ కూడా క్రియేట్ చేసుకోగలడా..? అన్నదే ఇక్కడ ప్రశ్న.

వైష్ణవ్ తేజ్ – ఉప్పెన : సాయి ధరమ్ తేజ్ తమ్ముడు… సినిమా టైటిల్ అయితే ఇంకా అనౌన్స్ కాలేదు కానీ అన్ అఫీషియల్ గా ‘ఉప్పెన’ అనే టాక్ నడుస్తుంది. మొదటి సినిమాకే రూరల్ బ్యాక్ డ్రాప్ ఎంచుకున్న వైష్ణవ తేజ్ డెసిషన్ చూస్తుంటే…. యాక్టర్ గా చాలా సీరియస్ గా ఉన్నాడనే తెలుస్తుంది. చూడాలి మరీ ఈ ‘ఉప్పెన’ వైష్ణవ్ ని ఏ స్థాయిలో నిలబడుతుందో…

అక్కినేని అఖిల్ : స్పెషల్ గా పరిచయం అవసరం లేదు. ఏ సినిమా చేసినా 100% ఎఫర్ట్ పెడతాడు ఈ అక్కినేని హీరో. దానితో పాటు అన్నయ్య నాగచైతన్యతో కొద్దో గొప్పో వేరియేషన్స్ ఉండేలా జాగ్రత్తపడతాడు. లవర్ బాయ్ గా పనికొస్తాడు.. యాక్షన్ హీరోగా కూడా సరిపోతాడు.

అల్లు అర్జున్ – అల్లు శిరీష్ : అల్లు అర్జున్ తో కంపేర్ చేస్తే అల్లు శిరీష్ కరియర్ లో ఇంకా గట్టి సక్సెస్ పడాల్సిన అవసరమైతే ఉంది. రీసెంట్ గా రిలీజైన ‘ABCD’ పాజిటివ్ టాక్ ని అందుకున్నా, మాస్ హీరో అనిపించుకునే స్థాయి సినిమా ఈ మెగా హీరోకి పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.