మరో స్పూఫ్ తో రెడీ...

Friday,November 04,2016 - 12:16 by Z_CLU

మీలో ఎవరు హాస్య ప్రియుడు? అంటూ సరి కొత్త స్పూఫు తో అలరించడానికి రెడీ అవుతున్నాడు కమెడియన్ పృద్వి. ఇప్పటికే  కామెడీ డైలాగ్స్, స్పూఫ్ కామెడీతో నవ్విస్తూ టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్న పృద్వి త్వరలో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ చిత్రం తో మరో సారి కడుపుబ్బా నవ్వించబోతున్నాడు. ఇటీవలే ‘బాబు బంగారం’ చిత్రం లో ‘నాన్నకు ప్రేమతో’ స్పూఫ్ తో థియేటర్ లో సందడి చేసిన పృద్వి మరో సారి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ చిత్రంతో ఎన్టీఆర్ నటించిన ‘జనతా గ్యారేజ్’ సినిమా స్పూఫ్ తో పాటు మరి కొన్ని సినిమాల స్పూఫులతో ఫుల్లెన్త్ క్యారెక్టర్ తో అలరించి సినిమాకు హైలైట్ గా నిలవనున్నాడు. నవీన్ చంద్ర, స్రుతి సోది నటిస్తున్న ఈ చిత్రం లో పృద్వి సరసన సలోని  నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ లో స్పూఫ్ డైలాగ్స్ తో సోషల్ మీడియా లో హల్ చల్  చేస్తున్నాడు ఈ స్టార్ కమెడియన్.