మహేష్ కొత్త సినిమా: మహర్షి టీజర్ రిలీజ్

Thursday,August 09,2018 - 11:05 by Z_CLU

మహేష్ కెరీర్ లో ప్రతిష్టాత్మక 25వ చిత్రం హంగామా ఇవాళ్టి నుంచి మొదలైంది. సూపర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా అర్థరాత్రి నుంచి మహేష్ కొత్త సినిమా హల్ చల్ చేస్తోంది. సరిగ్గా 12 గంటల 04 నిమిషాలకు మహేష్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. మహేష్ లేటెస్ట్ మేకోవర్ తో పాటు సినిమా టైటిల్ ను గ్రాండ్ గా ఎనౌన్స్ చేశారు.

ఇక పొద్దున్నే మహేష్ మూవీ టీజర్ ను విడుదల చేశారు. మహర్షి సినిమాలో రిషి పాత్రలో మహేష్ సరికొత్తగా కనిపిస్తున్నాడు. హెయిర్ స్టయిల్ మార్చాడు. లైట్ గా గడ్డం పెంచాడు. చేతిలో ల్యాప్ టాప్ తో రఫ్ అండ్ టఫ్ స్టూడెంట్ గా కనిపిస్తున్నాడు. దేవిశ్రీప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ టీజర్ కు మరింత అందం తీసుకొచ్చింది.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీ కలిసి నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. సమ్మర్ ఎట్రాక్షన్ గా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న థియేటర్లలోకి రానున్నాడు మహర్షి.