Interview - SS తమన్ (వకీల్ సాబ్)

Monday,March 22,2021 - 01:49 by Z_CLU

మ్యూజిక్ సెన్సేషన్ SS థమన్ మొదటి సారి పవన్ కళ్యాణ్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రస్తుతం మూడు పాటలతో ఈ ఆల్బం సినిమాపై అంచనాలు నెలకొల్పుతుంది. ఈ సందర్భంగా థమన్ ‘వకీల్ సాబ్‘ గురించి అలాగే పవన్ కళ్యాణ్ తో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి మీడియాతో మాట్లాడాడు. ఆ విశేషాలు తన మాటల్లోనే…

ఎక్కువ రోజులు సెలెబ్రేట్ చేసుకోగాలిగాం

పవన్ కళ్యాణ్ గారితో మొదటి సారి సినిమా చేస్తున్నా. కానీ సినిమా జస్ట్ ఆరు నెలల్లో పూర్తవుతుంది. చాలా తక్కువ టైం ఉంది సెలెబ్రేట్ చేసుకోవడానికి అనుకున్నా. కానీ లాక్ డౌన్ వల్ల ‘వకీల్ సాబ్’ ను దాదాపు ఏడాది పాటు సెలెబ్రేట్ చేసుకొనే అవకాశం వచ్చింది. ప్రతీ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశాము.

‘గబ్బర్ సింగ్’ చేయాల్సింది.

పవన్ కళ్యాణ్ గారి ‘ఖుషి’ , ‘గుడుంబా శంకర్’ సినిమాలకు ప్రోగ్రామర్ వర్క్ చేశాను. అప్పటి నుండి ఆయన నాకు పరిచయం. మిరపకాయ్ సినిమా తర్వాత ‘గబ్బర్ సింగ్’ కూడా నేనే చేయాల్సింది. కానీ అనుకోకుండా ఆ సినిమా మిస్ అయ్యింది. ఫైనల్లీ ఈ సినిమాతో ఆయనకీ మ్యూజిక్ ఇచ్చే ఛాన్స్ వచ్చింది. ఫీలింగ్ హ్యాపీ నవ్.

త్రివిక్రమ్ గారి వల్లే

వకీల్ సాబ్ కి మ్యూజిక్ చేసే అవకాశం నాకు త్రివిక్రమ్ గారి వల్లే వచ్చింది. ‘అలా వైకుంఠపురములో’ టైంలో నా గురించి దిల్ రాజు గారికి చెప్పి రీరికార్డింగ్ కి బాగా చేస్తాడు తమన్ పెట్టుకోండి అని రిఫర్ చేశారు. దిల్ రాజు గారు వెంటనే సరే అని నాతో మాట్లాడారు. సో ఈ సినిమా నాకు రావడానికి ముఖ్య కారణం త్రివిక్రమ్ గారే.

డ్రీం కం ట్రూ మూమెంట్

‘వకీల్ సాబ్’ నాకు డ్రీం కం ట్రూ మూమెంట్. సాంగ్స్ గురించి ఆలోచించలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి ఇంపార్టెన్స్ ఉన్న సినిమా అని మాత్రమే భావించా. కానీ కథలో చాలా మార్పులు జరగడంతో సాంగ్స్ కి స్కోప్ దొరికింది.  దాంతో మూడు పాటలు కంపోజ్ చేసే ఛాన్స్ లభించింది. సో ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారికి సాంగ్స్ కూడా కంపోజ్ చేశాను.

 

బ్రిలియంట్ డైరెక్టర్ 

డైరెక్టర్ వేణు శ్రీరామ్ గారు చాలా బ్రిలియంట్. ఆయన స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేశారు.  ఒక రీమేక్ సినిమాలో మార్పులు చేయడం అంత ఈజీ కాదు.  ఇద్దరం కలిసి 7 రోజులు ట్రావెల్ చేశాం. అప్పుడే ‘మగువా మగువా’ సాంగ్ ఐడియా వచ్చింది. ఆయనతో డిస్కస్ చేసి ఫైనల్ గా రాజు గారితో చెప్పాం.

వారం రోజులే దొరికింది.  

ఆల్బం నుండి రిలీజ్ అయ్యే మొదటి సాంగ్  ‘మగువా మగువా’ సాంగ్ ను ఉమెన్స్ డే కి రిలీజ్ చేయాలని అనుకున్నాం.  ఆ సాంగ్ ని జస్ట్ వారం రోజుల్లోనే కంపోజ్ చేసి రికార్డింగ్ చేశాం. మంచి అవుట్ పుట్ వచ్చింది.  సిద్ శ్రీరామ్ తో ఆ సాంగ్ పాడించాక కోర్ట్ సీన్ షూట్ జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వినిపించా. ఆయనకీ బాగా నచ్చింది. హగ్ ఇచ్చి సంతోషాన్ని ఎక్స్ ప్రెస్ చేశారు. కంటిపాప కూడా కారులో ట్రావెల్ చేస్తూ వినిపించా. కారులోనే లైట్ గా డాన్స్ వేస్తూ ఆ సాంగ్ ఎంజాయ్ చేశారు. సత్యమేవ జయతే విన్నప్పుడు కూడా చాలా హ్యాపీ గా ఫీలయ్యారు.

ఈ సాంగే వినిపిస్తుంది

‘మగువా మగువా’ సాంగ్ రిలీజ్ చేసినప్పుడు సాంగ్ అందరికీ నచ్చుతుంది. పాపులర్ అవుతుంది అనుకున్నాం. కానీ ఈ రేంజ్ రెస్పాన్స్ అస్సలు ఊహించలేదు.  ఎక్కడికి వెళ్లినా ఈ సాంగే వినిపిస్తుంది. మా మదర్ ఈ సాంగ్ కు బాగా కనెక్ట్ అయ్యారు.   ఎవర్ గ్రీన్ సాంగ్ అయిపొయింది. అందరూ ఉమెన్ మీద రెస్పెక్ట్ తో ఆ సాంగ్ వింటుంటే చాలా సంతోషమేస్తుంది. చిరంజీవి గారు కూడా వాళ్ళమ్మ గారితో ఒక వీడియో చేసి ఈ సాంగ్ పెట్టుకున్నారు. అది చూసి ఆనందపడ్డాను. ‘మగువా మగువా’ ఎప్పటికీ వినిపిస్తూ గుర్తుండే పాట అవుతుంది.

 

స్పేస్ క్రియేట్ చేసుకున్నాం.

నిజానికి వకీల్ సాబ్ లో సాంగ్స్ పెట్టె స్కోప్ లేదు. కానీ డైరెక్టర్ చేసిన మార్పుల వల్ల స్పేస్ క్రియేట్ అయ్యింది. సో మ్యూజిక్ డైరెక్టర్ కి స్పేస్ క్రియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాకు ఆ స్పేస్ క్రియేట్ చేసుకొని మంచి సాంగ్స్ కంపోజ్ చేయగలిగాను.

‘వకీల్ సాబ్’  సప్రయిజ్ అవుతారు.

సినిమా సెకండాఫ్ లో ఒక సప్రయిజ్ ఉంటుంది. అదేంటనేది ఇప్పుడు చెప్పలేను. అది స్క్రీన్ పై చూసి సప్రయిజ్ అవ్వాల్సిందే.

 

ప్రీ రిలీజ్ ఈవెంట్ కి భారీ సెటప్

ఏప్రిల్ 3 న జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కి భారీ ప్లాన్ రెడీ అయింది. ఆ రోజు ఆల్బంలో సాంగ్స్ పాడిన సింగర్స్  అందరు లైవ్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. శంకర్ మహదేవన్, సిద్ శ్రీరామ్, అర్మాన్ మాలిక్ సింగర్స్ తో పాటు శివమణి డ్రమ్స్ తో లైవ్ ప్రోగ్రాం ఉంటుంది. ఆ రోజు వకీల్ సాబ్  మ్యూజిక్ ఇంకా భారీగా సెలెబ్రేట్ చేయబోతున్నాం.

పవన్ కళ్యాణ్ గారితో పాడిస్తా 

పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా చేయడమే అదృష్టం అనుకుంటే బ్యాక్ టు బ్యాక్ అయన రెండు సినిమాలకు మ్యూజిక్ ఇచ్చే ఛాన్స్ వచ్చింది. అయ్యప్పనుమ్ కోశియం రీమేక్ మ్యూజిక్ వర్క్ స్టార్ట్ అయ్యింది. ఆల్రెడీ రెండు సాంగ్స్ కంపోజ్ చేశాను. ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ గారితో కచ్చితంగా ఒక పాత పాడిస్తా.

హీరో ని బట్టే

హీరో ఇమేజ్ ని బట్టే మ్యూజిక్ ఇవ్వాలి. ‘వకీల్ సాబ్’ చిరంజీవి గారు చేస్తే నా మ్యూజిక్ వేరేలా ఉంటుంది. హీరోని బట్టే మ్యూజిక్ ఎలా ఇవ్వాలో ఆలోచిస్తా.  ఒక్కో సారి కథను, అక్కడ స్విచువేషణ్ ని బట్టి కూడా పాటలు కంపోజ్ చేయాల్సి వస్తుంది.

పబ్ లు , పార్టీలు అలవాటు లేదు 

మ్యూజిక్ స్టూడియో కాకుండా నేను ఎక్కువగా గడిపేది క్రికెట్ గ్రౌండ్ లోనే. రాత్రి తొమ్మిది వరకు మ్యూజిక్ వర్క్ ఫినిష్ చేసి గ్రౌండ్ కి వెళ్ళిపోతా. నాకు మంచి టీం ఉంది. అందరం కలిసి నైట్ రెండు మూడు గంటలు క్రికెట్ ఆది రిలాక్స్ అవుతాం. నాకు పబ్ లు , పార్టీలు అలవాటు లేదు.