VakeelSaab ఐయామ్ ప్రౌడ్ ఫ్యాన్ ఆఫ్ పీఎస్ పీకే

Monday,April 05,2021 - 05:35 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్‘ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈవెంట్ లో అందరు ఎమోషనల్ గా మాట్లాడుతూ తమ స్పీచ్ లతో ఆకట్టుకొని సినిమాపై అంచనాలు పెంచేశారు.

ఇక దర్శకుడు శ్రీ రామ్ వేణు మాట్లాడుతూ “ఒక రోజు త్రివిక్రమ్ గారు ఫోన్ చేసి కళ్యాణ్ గారిని కలుద్దాం రండి అన్నారు. ఆయన ఇంటికి వెళ్తే అక్కడ పవన్ గారు ఉన్నారు. అక్కడ తెల్లటి దుస్తుల్లో పవన్ గారిని చూస్తుంటే ఒక గుడిలోకి వెళ్తున్నట్లు ఫీలింగ్ కలిగింది. హిమాలయాల గురించి చదివినప్పుడు ప్రేమతో పాటు భయంగా అనిపిస్తుంది. అవి కరిగితే దేశం మునిగిపోతుందనే భయం. ఈ ప్రేమ భయం అనే రెండు ఫీలింగ్స్ నేను పవన్ గారిని తొలిసారి కలిసినప్పుడు అనుభూతి చెందాను. ఐయామ్ ప్రౌడ్ ఫ్యాన్ ఆఫ్ పీఎస్ పీకే. బలంగా నమ్మిందే విధి అనుకుంటాను. నేను ఫస్ట్ డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసింది పవన్ గారి యాడ్ కి. సంధ్య థియేటర్లో తొలి ప్రేమ సినిమా చూసిన రాజు గారు, హరీష్ శంకర్ గారితో పాటు నేనూ అక్కడే ఉన్నా. కానీ నేను పవన్ గారి చిత్రానికి దర్శకుడిని అవుతానని అనుకోలేదు.” అంటూ ఎమోషన్ స్పీచ్ తో పవన్ ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నారు దర్శకుడు.