బన్నీతో చేద్దామనుకున్నా

Tuesday,April 11,2017 - 10:55 by Z_CLU

ఓ హీరోను ఊహించుకొని దర్శకులు కథలు రెడీ చేసి చివరికి మరో హీరోతో సెట్స్ పైకి వెళ్లడం షరా మాములే.. లేటెస్ట్ గా ఇలాంటి ఓ స్టోరీ ఓ హీరో కోసం రెడీ అయ్యి మరో హీరో చేతికెళ్ళిందట. ఆ సినిమా మరేదో కాదో వరుణ్ తేజ నటించిన ‘మిస్టర్’..

ముందుగా మిస్టర్ సినిమాను అల్లు అర్జున్ తో చేయాలనుకున్నాడట శ్రీను వైట్ల. ఈ విషయాన్నీ ఇటీవలే ఓ ఇంటర్వ్యూ ద్వారా తెలిపాడు వైట్ల. మిస్టర్ ప్రమోషన్ లో భాగంగా మీడియా కిచ్చిన ఓ ఇంటర్వ్యూ లో ” ఈ సినిమాను ముందుగా బన్నీ తో చేయాలనుకున్న కానీ ఫైనల్ గా వరుణ్ తో చేశా” అంటూ తెలిపాడు శ్రీను వైట్ల. సో ఓ మెగా హీరో కోసం రెడీ అయిన కథ మరో మెగా హీరో చేతిలో పడిందన్నమాట…