శ్రీరామనవమి సందర్భంగా 'శ్రీనివాస కళ్యాణం' టీజర్

Sunday,March 25,2018 - 10:03 by Z_CLU

సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో నితిన్ నటిస్తున్న ‘శ్రీనివాస కళ్యాణం’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం అమలాపురం సమీపంలో నితిన్ , నందిత శ్వేతాలతో పాటు మరికొందరు నటీ నటులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు యూనిట్. అయితే ప్రారంభం రోజున మోషన్ పోస్టర్స్ కూడిన టీజర్ ను రిలీజ్ చేసి సప్రయిజ్ చేసిన మేకర్స్ ప్రస్తుతం మరో టీజర్ ను విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారట. ‘శ్రీ రామ నవమి’ సందర్భంగా మోషన్ పోస్టర్స్ తో కూడిన మరో టీజర్ ని సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తుంది.

‘శతమానం భవతి’ సూపర్ హిట్ తర్వాత దిల్ రాజు -సతీష్ వేగేశ్న కాంబినేషన్ లో  ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా  తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. నందిత శ్వేతా ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.