శ్రీనివాసకళ్యాణం ఫస్ట్ వీక్ కలెక్షన్

Friday,August 17,2018 - 12:34 by Z_CLU

నితిన్, రాశిఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా శ్రీనివాసకల్యాణం. దిల్ రాజు బ్యానర్ పై సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నందిత శ్వేత కనిపించింది. ప్రకాష్ రాజ్, జయసుధ ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమా, పెళ్లి గొప్పదనాన్ని చాటేలా తెరకెక్కింది.

ప్రస్తుతం ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తూ థియేటర్లలో కొనసాగుతున్న ఈ సినిమా, వారం రోజుల రన్ పూర్తిచేసుకుంది. మొదటివారం ఈ సినిమాకు వరల్డ్ వైడ్ 11 కోట్ల 67 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

ఏపీ, నైజాం ఫస్ట్ వీక్ షేర్
నైజాం – రూ. 4.70 కోట్లు
సీడెడ్ – రూ. 1.40 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 1.28 కోట్లు
ఈస్ట్ – రూ. 70 లక్షలు
వెస్ట్ – రూ. 47 లక్షలు
గుంటూరు – రూ. 74 లక్షలు
కృష్ణా – రూ. 60 లక్షలు
నెల్లూరు – రూ. 31 లక్షలు